English | Telugu

Bigg Boss 9 Telugu weekend promo: సుమన్ శెట్టికి సపోర్ట్ గా నాగార్జున.. రీతూకి ఇచ్చిపడేశాడుగా!


బిగ్ బాస్ సీజన్-9 లో అయిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ‌ఇందులో నాగార్జున మాస్ లుక్ లో‌ ఎంట్రీ ఇచ్చాడు.‌ ఇక వచ్చీ రాగానే వారంలో అందరు చేసిన మిస్టేక్స్ ని బయటకు చెప్తూ క్లాస్ పీకాడు.‌

తాజాగా రిలీజ్ అయిన సెకెండ్ ప్రోమోలో ప్లోరా సైనీ, రాము రాథోడ్ లకి ఇచ్చిపడేశాడు నాగ్ మామ. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కాళ్ళు టచ్ అయ్యాయని సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకున్నాడంటూ తనని ఫ్లోరా సైనీ ఎలిమినేషన్ అంటు ప్రకటించింది. అది రాంగ్ డెసిషన్ అంటు బిబి ఆడియన్ చెప్పారు. మీ రాంగ్ డెసిషన్ వల్ల సుమన్ శెట్టి టీమ్ సేఫ్ జోన్ లోకి రాలేకపోయారని రాము రాథోడ్, ఫ్లోరాలకి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఇక మన డీమాన్ పవన్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. గ్లాస్ టాస్క్ అయ్యాక ఓ మూలన కూర్చొని రీతూని అలా అనడం కరెక్టేనా అని అడిగాడు.‌ ఇక శ్రీజని సుమన్ శెట్టితో జంటగా ఉండమని నువ్వు చెప్పావా అని రీతూని నాగార్జున అడుగగా..‌తను గుర్తులేదని చెప్పింది. రీతూ కట్ అయింది నీ హెయిర్.. నీ మెమరీ కాదంటూ పంచ్ వేశాడు నాగార్జున.

ఇక అందరికి క్లాస్ పీకిన నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చాడు. మీరు ఆటలో ముందుకి వెళ్ళాలంటే మీకు ఒక పవర్ ఫుల్ అస్త్ర కావాలి.. అదే పవర్ అస్త్ర అని చూపించాడు. తనూజ, దివ్య, భరణి, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ ఈ పవర్ అస్త్రకి దగ్గరగా ఉన్నారు. మరి వీరిలో ఈ పవర్ అస్త్ర ఎవరికి దక్కుతుందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.