English | Telugu

Bigg Boss 9 Winner: బిగ్ బాస్-9 విన్నర్ కళ్యాణ్ పడాల.. ఇమ్మాన్యుయేల్ కి అన్యాయం జరిగిందా?

బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చివరి వరకూ విన్నర్ రేసులో నిలిచిన తనూజ గౌడ రన్నరప్‌గా నిలిచింది.

ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. పదిహేను వారాలు హౌస్ లో ప్రతీ గేమ్ ఆడి.. ఎంతో మంది అభిమానుల్ని పొందాడు పవన్ కళ్యాణ్ పడాల. ఇక టాప్-5 కోసం జరిగిన పోటీలో డీమాన్ పవన్ ని ఓడించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్.

ఇక బిగ్ బాస్ సీజన్-9 లో అల్టిమేట్ గేమర్ ఎవరంటే చాలామంది ఉన్నారు.. కానీ ఇమ్మాన్యుయేల్ రియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు‌‌. అతడికి అన్యాయం జరిగింది. ఎందుకంటే తన స్కిట్స్ తో షోని టాప్ కి తీసుకెళ్ళాడు. ప్రతీ సీజన్ లో లాగే అతడిని టాప్-5 దాకా ఉంచి, నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. లేదంటే అతను రన్నరప్ అయ్యేవాడు.

ఇక తనూజ ఫ్యాన్స్ కి ఇది పెద్ద డిజప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్, తనూజ ఇద్దరు నామినేషన్ లో ఉన్నప్పుడు తనూజకే అత్యధిక ఓట్లు వచ్చేవి.. తనే ఫస్ట్ పొజిషన్ లో ఉండేది.

నిన్నటి గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ లో సంజనని టాప్-5 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేయగా, ఇమ్మాన్యుయేల్ ని నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. డీమాన్ పవన్ పదిహేను లక్షలు తీసుకొని మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లో తనూజ, పవన్ కళ్యాణ్ పడాల ఇద్దరు హౌస్ లో ఉండగా నాగార్జున హౌస్ లోకి గోల్డెన్ సూట్ కేస్ తో వెళ్తాడు. వారిద్దరికి ఇరవై లక్షలు ఆఫర్ ఇవ్వగా ఎవరూ తీసుకోరు. ఇక చేసేమీ లేక వాళ్ళిద్దరిని నాగార్జున స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. కౌంట్ డౌన్‌స్టార్ట్ చేసి విన్నర్ కళ్యాణ్ అని అతని చేతిని పైకి లేపుతాడు. ఇక హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ తో అభినందిస్తారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.