English | Telugu

బిగ్ బాస్-8 లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకొని ఎనిమిదో వారం ఎండింగ్ కి వచ్చేసింది. శనివారం, ఆదివారం అనగానే ఎలిమినేషన్ గుర్తొస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న క్యూరియాసిటి అందరిలో ఉంది. ఇప్పటికే హౌస్ నుండి ఏడుగురు బయటకు వచ్చేసారు. గత వారం గౌతమ్ లీస్ట్ లో ఉండగా అప్పటికే మణికంఠ నేను వెళ్ళిపోతా అని అనడంతో గౌతమ్ ని ఆపి మణికంఠని పంపించేశారు.

బిగ్ బాస్ లో కొన్ని ఎలిమినేషన్స్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఈ వారం ఆరుగురు నామినేషన్ లో ఉండగా నిఖిల్ ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే లీస్ట్ లో నయని పావని, మెహబూబ్ ఇద్దరు ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఉన్నారు.. ఓజీ వాళ్ళు ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారం రాయల్స్ నుండి మెహబూబ్ ఎలిమినేషన్ అనేది మొదటిది. ఈ వారం హౌస్ లో మెహబూబ్ ఆటతీరు బానే ఉన్నా బయటకు వచ్చేసాడంటే నామినేషన్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడమే కారణం. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.