English | Telugu

నచ్చిన వాళ్లకు విన్నర్‌ని.. నచ్చని వాళ్లకు రన్నర్‌ని!

బిగ్ బాస్ సీజన్ 6 శ్రీహాన్ టాప్ 2 లో నిలబడి రన్నరప్ అయ్యాడు. నిజానికి రేవంత్ కంటే కూడా శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ చెప్పారు. అందుకే శ్రీహాన్ రన్నర్ కం విన్నర్ అని చెప్పారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రీహాన్ మాట్లాడాడు. "ఫైనల్స్ లో స్టేజి మీద ఉండే ఇద్దరిలో నేను, రేవంత్ ఉండాలి అని కోరుకున్నాను. రేవంత్ ఆల్రెడీ సింగర్ కాబట్టి మంచి క్రేజ్ కూడా ఉంది కాబట్టి ఎక్కువ ఓట్లు వస్తాయనే అనుకున్నా..కానీ నా ఆటతీరుపై నాకు ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఉంది." అన్నాడు శ్రీహాన్.

ఇక ఫైనల్ గా "నాకే ఎక్కువగా ఓట్లు వచ్చాయన్న విషయం బిగ్ బాస్ ఎప్పుడైతే రివీల్ చేశారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నచ్చిన వాళ్ళు విన్నర్ అని , నచ్చని వాళ్లకు రన్నర్ అని అనుకుంటారు. ఏదైతే ఏముంది. ఇకపోతే నేను సిరి ఒకే టైంలో బిగ్ బాస్ కి వెళ్లుంటే బాగుండేది అనే కామెంట్స్ గురించి నాకు తెలిసింది కానీ మాకు మాత్రం ఆ ఆలోచన లేదు. ఎందుకంటే ఎవరి ఐడెంటిటీ వారికి చాలా ఇంపార్టెంట్ " అని చెప్పాడు శ్రీహాన్.