English | Telugu

ఈయన ఇన్పుట్స్ ఇస్తారు..ఆయన ఏ స్టెప్ ఐనా వేసేస్తారు

టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. ఆయన ఏ పాట చేసినా అది సోషల్ మీడియాలో మంచి వ్యూస్ సంపాదించుకుంటాయి. ఇప్పుడు ఆయన కోరియోగ్రఫీ చేసిన చిరంజీవి మూవీ "వాల్తేరు వీరయ్య"..బాలయ్య మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. వీటికి సంబంధించి ఆయన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

"వాల్తేరు వీరయ్య మూవీలోని ఐదు సాంగ్స్ కి నేనే కోరియోగ్రఫీ చేసాను. చిరంజీవి గారి గ్రేస్ ని దృష్టిలో పెట్టుకుని మరీ స్టెప్స్ ని కంపోజ్ చేసాను. ఎందుకంటే ఆడియన్స్ కి ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని ఎక్కడ తగ్గించకుండా డాన్స్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకే ముందుగా నేను రెండు మూడు వెర్షన్స్ చేసి ఆయనకు చూపిస్తాను. ఆయనకి ఏది నచ్చితే దానితోనే సెట్స్ పైకి వెళతాను. చిరంజీవి గారు కూడా మంచి ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు." అని అన్నారు.

ఇక బాలయ్య సార్ విషయానికొస్తే, 'వీరసింహా రెడ్డి' లో రెండు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసాను. ఆయన గురించి చెప్పక్కర్లేదు..ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో ఆ విధంగా స్టెప్స్ కంపోజ్ చేయాలి. ఆయన స్టెప్స్ కి విజిల్స్ పడేలా కంపోజ్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ కంపోజ్ విషయంలో బాలయ్యగారు చేంజెస్ ఏమీ చెప్పరు. అది ఎలాంటి స్టెప్ అయినా వెనకాడకుండా చేస్తారు. నేను చేసిన భారీ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అవుతుండేసరికి నాలో యాంగ్జైటీ పెరుగుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్.