English | Telugu
బిగ్‌బాస్ 6 లిస్ట్ ఫైనల్ అయినట్టేనా?
Updated : Jun 4, 2022
బిగ్‌బాస్ సీజన్ 5 గత ఏడాది డిసెంబర్ 19న ముగిసింది. ఈ సీజన్ విజేతగా వీజే సన్నీ టైటిల్‌ని సొంతం చేసుకుని విజేతగా నిలిచాడు. ఫైనల్ లో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరేట్ అంటూ ముందు నుంచి ప్రచారం జరిగినా హౌస్ లో షణ్ముఖ్ - సిరి హన్మంత్ ల మధ్య సాగిన ఓవర్ డోస్ రొమాన్స్ కారణంగా షణ్ముక్ ఒక్కసారిగా విన్నర్ స్థానం నుంచి రన్నర్ స్థానానికి జారిపోయాడు. నెటిజన్ లకు షణ్ముఖ్ - సిరి హన్మంత్ ల రోమాన్స్ వెగటు పుట్టడంతో ఇద్దరిని నెట్టింట ట్రోల్ చేశారు.
ఆ తరువాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలిసిందే. దీని కారణంగానే షణ్ముక్ - దీప్తి సునయనల మధ్య దూరం పెరిగింది. ఫైనల్ గా ఇద్దరు బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదిలా వుంటే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ని ప్రారంభించారు. ఫైనల్ లో అఖిల్ కు షాకిచ్చి లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచింది. ఓటీటీ వెర్షన్ కూడా ముగియడంతో తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కు స్టార్ మా వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇటీవలే దీనికి సంబంధించిన తాజా ప్రోమోని విడుదల చేశారు.
నాగార్జున పై షూట్ చేసిన ఈ ప్రోమోలో సామాన్యులకు సీజన్ 6లో అవకాశం కల్పిస్తున్నామని, ఈ గోల్డెన్ ఛాన్స్ ని వినియోగించుకోండి అంటూ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇదిలా వుంటే సీజన్ 6 కు సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయిందంటూ కొంత మంది పేర్లు తాజాగా తెరపైకొచ్చాయి. మొత్తం 16 మంది పేర్లు ఇప్పడు నెట్టింట సందడి చేస్తున్నాయి. `న్యూలీ మ్యారీడ్ ఫేమ్` సంజనా చౌదరి, హీరోయిన్ ఆశా షైనీ, యూట్యూబర్ కుషిత కల్లపు, యాంకర్ మంజుష, సింగర్ మోహన్ భోగరాజు, జబర్దస్త్ వర్ష, యాంకర్ మంజూష (సుమన్ టీవి), పొప్పి మాస్టర్ (కొరియోగ్రాఫర్), సీరియల్ నటి కరుణ, యాంకర్ రోషన్, లక్ష్య చదలవాడ, కౌశిక్ (టీవి నడుడు), శ్రీహాన్, చైతన్య గరికపాటి ల పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.