English | Telugu

సిరి ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరిచిందా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. అయితే ఈ సీజ‌న్ లో సిరి, ష‌న్ను చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. కెమెరాల ముందే హ‌గ్గులు.. ముద్దులు.. అవ‌స‌రం లేకున్నా.. హ‌గ్గిస్తానంటూ సిరి, ష‌న్ను చేసిన అరాచ‌కంపై నెటిజ‌న్స్ ఎన్ని సార్లు మొట్టికాయ‌లు వేసినా ఈ జంట లైట్ తీసుకుంది. హౌస్‌లో ఏందిరా ఈ గ‌లీజ్ ప‌ని అంటూ స‌న్నీ కామెంట్ చేసినా.. ఇద్ద‌రి పేరెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి మీ హ‌గ్గులు న‌చ్చ‌లేద‌ని ఓపెన్‌గా చెప్పినా ఈ సిరి, ష‌న్ను `న‌వ్వి పోదురు గాక మాకేటి సిగ్గు` అన్న‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించారే కానీ త‌ప్పు చేస్తున్నామ‌ని మాత్రం గ్ర‌హించ‌లేదు.

ఇదే ష‌న్నుని, సిరిని బిగ్‌బాస్ హౌస్‌లో క్యారెక్ట‌ర్ కోల్పోయేలా చేసింది. కెమెరాల ముందు కోట్ల మంది చూస్తున్నార‌న్న భ‌యం లేకుండా విచ్చిల‌విడిగా రెచ్చిపోయిన వీరిని చీద‌రించుకోని ఆడియ‌న్ ,నెటిజ‌న్ లేడంటే వీరు చేసిన ర‌చ్చ ఏస్థాయిలో వెగ‌టు పుట్టించిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆకులు కాలాక చేతులు ప‌ట్టుకున్న‌చందంగా జ‌రిగిన నష్టం జ‌రిగాక ఇప్పుడు సిరి ఎమోష‌న‌ల్ అవుతోంది. త‌న‌పై జ‌రుగుతున్న నెగ‌టివిటీకి బావురు మంటోంది.

ష‌న్నుతో త‌న‌ది ఫ్రెండ్షిప్ మాత్ర‌మే న‌ని హౌస్ లో త‌న‌తో ఎలా వున్నానో బ‌య‌ట కూడా అలాగే వుంటాన‌ని మ‌ళ్లీ అదే పాట పాడింది. నిజంగా అమ్మ వ‌చ్చి చెప్పిన త‌రువాత నుంచి నా ప‌ద్ద‌తిని మార్చుకుని వుంటే నిజంగానే నేను చేసింది త‌ప్ప‌ని ఒప్పుకున్న‌ట్టు అయ్యేది.. అందుకే అమ్మ చెప్పినా నా మ‌న‌సు మార్చుకోలేదు. అది జ‌నానికి న‌చ్చ‌లేదు. అందుకే వారికి సారీ చెబుతున్నాను. ఈ విష‌యంలో నాపై వ‌స్తున్న కామెంట్స్ ని చూడ‌లేక‌పోతున్నా.. నా లైఫ్ లో ఇంత నెగ‌టివిటీని ఎప్పుడూ చూడ‌లేదు.

ఈ సంద‌ర్భంగా నాపై కామెంట్స్ చేస్తున్న వారికి నేను ఒక‌టే చెబుతున్నాను. నిజంగానే మా ఇద్ద‌రిలో చెడు వుంటే కెమెరాల ముందు ఎందుకు చేస్తాం. . ఇంకేదైనా ప్లేస్ లో చేసే వాళ్లం క‌దా? మాకు నిజంగా చెడు ఉద్దేశ్యం లేదు. మేం లోప‌ల ఎంత నిజాయితీగా వున్నామో బ‌య‌ట కూడా అలాగే వుంటాం. మా అనుబంధం అలాగే కొన‌సాగుతుంది. ద‌య‌చేసి నెగిటివ్ గా తీసుకోకండి` అని సిరి నెటిజ‌న్ ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తోంది. అయినా ఆమెపై ట్రోలింగ్ ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.