English | Telugu

నేను ఆల్రెడీ గెలిచేశాను సర్.. విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన అవినాష్!

బిగ్‌బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి చేరుకుంది. నేటి సండే ఎపిసోడ్ తో సీజన్-8 ముగియనుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. హౌస్‌మేట్స్ అందరికీ ఓ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ షో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని ఎప్పటికీ కలవకూడదనుకుంటున్నారో చెప్పండి అంటూ బోర్డ్‌పై ఫాలో, బ్లాక్ సింబల్స్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక హౌస్‌మేట్స్ వాళ్ల వాళ్ల అభిప్రాయం ప్రకారం ఎవరిని ఫాలో, ఎవరి బ్లాక్ చేయాలి అనుకుంటన్నది చెప్పారు. అయితే అందరూ దాదాపు అందరినీ ఫాలో కావాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక బ్లాక్ విషయానికొస్తే ముందుగా సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ ప్రేరణ బ్లాక్ చేసింది. ఇక నబీల్ అయితే హరితేజ, సోనియా ఇద్దరినీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. నేను పగబడతానని హరితేజ అంది అందుకే బ్లాక్ చేశా.. సోనియా నామినేషన్స్‌లో నన్ను టార్గెట్ చేసింది అందుకే బ్లాక్ అంటూ నబీల్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక మిగిలిన వారితో పోలిస్తే తక్కువ పరిచయం ఉండటం వల్లే పృథ్వీ ని బ్లాక్ చేశాడు గౌతమ్. బేబక్క, సీతను బ్లాక్‌ చేశాడు నిఖిల్. పృథ్వీని టెంపరరీగా బ్లాక్‌ చేస్తానని అవినాష్ చెప్పాడు. ఆ తర్వాత అందరు మీ జీవితంలోని బెస్ట్‌, వరస్ట్‌ సంఘటనలను పంచుకోండని బిగ్‌బాస్ అడిగాడు. ముందుగా నబీల్‌ మాట్లాడుతూ ఏదో సాధించాలని కలలు కన్న నాకు.. బిగ్‌బాస్ లాంటి పెద్ద ఆఫర్ రావడమే లైఫ్‌లో బెస్ట్ విషయం అంటూ చెప్పాడు. ఇక 10వ తరగతి తర్వాత బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది. అప్పుడు హాస్పిటల్‌‌లో చూసిన లైఫ్ ది వరస్ట్ అంటూ నబీల్ చెప్పాడు. ఇక ప్రేరణ మాట్లాడుతూ దేవుడి దయవల్ల నాకు అంత వరస్ట్ సిట్యూవేషన్స్ అయితే ఎప్పుడూ రాలేదు. కానీ నా నానమ్మకి నేనంటే చాలా ఇష్టం.. నాతో మాట్లాడటం కోసం చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెప్పేది. అప్పుడు ఆమెపై చిరాకుపడేదాన్ని.. కానీ నానమ్మ వెళ్లిపోయాకే ఆ లోటు తెలిసిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక చివరిగా అవినాష్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పకూడదనుకున్నా కానీ బిగ్‌బాస్ నా ఫ్యామిలీ కాబట్టి చెబుతున్నాను. నేను, నా భార్య అను పిల్లల విషయంలో ఎన్నో కలలు కన్నాం.. కానీ ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పుట్టినట్లే పుట్టి చనిపోయాడు. చాలా బుజ్జిగా ఉండేవాడు.. వాడిని ఇలా ఎత్తుకున్నదే గుర్తుంది.. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదంటూ అవినాష్ ఏడ్చేశాడు. అవినాష్‌ని అలా చూసి హౌస్‌మేట్స్ అందరూ బాధపడ్డారు. నీకు ఈసారి ట్విన్స్ పుడతారు చూడమంటూ ప్రేరణ ఏడుస్తూ చెప్పింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.