English | Telugu

Krishna Mukunda Murari:ఆ ఇంట్లో తనని చూసి షాకైన భవాని.. అతను పెళ్ళికి ఒప్పుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -328 లో...శ్రీనివాస్ అన్నయ్యకి ఒక మాటచెప్పి నిర్ణయం తీసుకోండి అక్క అని భవానితో రేవతి అనగానే.. అతను పెళ్లి అడ్డుకుంటాడు అనే ఆశనా.. అయిన కూతురు జీవితం బాగుపడుతుందంటే ఎవరు వద్దని అంటారని భవాని అంటుంది. అప్పుడే ముకుంద వచ్చి ఈ పెళ్లి వద్దని అనగానే అందరు ఆశ్చర్యపోతారు.

ఆ తర్వాత ఇంట్లో ఎవరికీ పెళ్లి ఇష్టం లేదని ముకుంద కావాలనే భవాని ముందు నటిస్తు ఉంటుంది. అక్కడ కృష్ణ మురారికీ గతం గుర్తుకు వచ్చేలా చేస్తుంది. "మీకు ఏదైనా గుర్తుకు వస్తే నాకు చెప్పండి. దాని గురించి క్లారిటీగా చెప్తానని‌ కృష్ణ అంది" అంటూ భవానీతో ముకుంద చెప్తుంది. దాంతో ఇక పెళ్లి విషయంలో లేట్ చేస్తే లాభం లేదు. త్వరగా పెళ్లి చేసెయ్యలని పంతులు గారిని తీసుకొని రమ్మని ముకుందకి చెప్తుంది. నేను చేసేది మంచి పని అని త్వరలో తెలుసుకుంటారు. ఎక్కవగా అలోచించకండని భవాని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. మరొకవైపు కృష్ణ , మురారి లు మాట్లాడుకుంటు ఉంటే.. అప్పుడే ముకుంద వచ్చి పెద్ద అత్తయ్య తీసుకొని రమ్మంటుందంటూ మురారి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది.

నీ భర్తని తను చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుందని అనగానే.. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వమని కృష్ణ చెప్తుంది. మరొకవైపు మురారి భవాని దగ్గరికి వెళ్ళగానే.. ముకుందకి నీకు పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. ముహూర్తం ఫిక్స్ చేస్తున్నానని మురారికి భవాని చెప్తుంది. మురారికి ఇష్టం లేకపోయిన అక్కడ కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత పంతులు జాతకాలు కలవలేదని మొదటగా చెప్పినా.. ఆ తర్వాత వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందని చెప్పగానే ముకుంద, భవానిలు తప్ప అందరు డిస్సపాయింట్ అవుతారు. తరువాయి భాగంలో.. శ్రీనివాస్ ఇంటికి కృష్ణ వెళ్తుంది. అదే టైమ్ లో శ్రీనివాస్ ఇంటికి ముకుంద, మురారి, భవాని వస్తారు. ఏ తర్వాత వాటర్ కోసం అంటూ మురారి కిచెన్ లోకి వెళ్ళగానే అక్కడ కృష్ణని చూసి మురారి ఆశ్చర్యపోతాడు. అప్పుడే కృష్ణ దగ్గరికి భవాని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.