English | Telugu

కృష్ణ, మురారీలని వదిలేయమని చెప్పిన రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -172 లో....పెళ్లికి ముందు మురారి జీవితంలో వేరే అమ్మాయి ఉందని కృష్ణ ఉహించుకోలేకపోతుంది. మనసులో బాధని పెట్టుకొని మురారితో నవ్వుతు మాట్లాడుతుంది. కానీ మురారికి కృష్ణ మాటలు అర్థం కావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ కృష్ణ అని మురారి అడుగుతాడు. నేను ఎప్పటిలాగే మాట్లాడుతున్నా అన్నట్లుగా కృష్ణ సమాధానం ఇస్తుంది.

ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు రెడీ అయి వెళ్ళేముందు రేవతికి చెప్పి వెళ్తారు. అలా ఇద్దరు కలిసి సంతోషంగా వెళ్లడం చూసిన ముకుంద.. వాళ్ళని అలా చూసి తట్టుకోలేక గదిలోకి వెళ్లి బాధపడుతుంది. "మురారి ఎందుకు ఇలా మారిపోతున్నాడు.. అసలు ఏం జరుగుతుంది" అని ముకుంద అనుకొని.. మురారికి కృష్ణ ప్రపోజ్ చేసిన దానిని గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు ముకుంద గురించి రేవతి ఆలోచిస్తూ.. కృష్ణ, మురారిలు సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది.. ఈ ముకుంద వల్ల నాకు రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. ఎలాగైనా కృష్ణ, మురారిల జోలికి ముకుంద రాకుండా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలని రేవతి వెళ్తుంది. రేవతి వెళ్ళేసరికి ముకుంద టేబుల్ మీద ఉన్న వస్తువులను కోపంగా కిందపడేస్తుంది. ఏంటి ముకుంద చిందర వందరగా చేసావని రేవతి అంటుంది. ఇక్కడ నా జీవితం కూడా చిందరవందరగానే ఉందని ముకుంద అంటుంది.

నీ జీవితాన్ని నువ్వే అలా చేసుకుంటున్నావు. ఇలా ఎన్ని రోజులు ఉంటావ్.. మీ నాన్న చెప్పినట్టు చెయ్యొచ్చు కదా ముకుంద అని రేవతి అంటుంది. నేను అలా చెయ్యను.‌. అది నాకు ఇష్టం లేదు. నాకు నచ్చింది నాకు దక్కాలని ముకుంద అంటుంది. ఏంటి నీకు నచ్చింది.. నాకు అంతా తెలుసు.. మురారి నువ్వు ప్రేమించుకున్న విషయం నాకు తెలుసని రేవతి అనగా... తెలిసి కూడా నాకు న్యాయం చెయ్యలేరా అని ముకుంద అంటుంది. నీకు న్యాయం చెయ్యడం అంటే ఇంకొక అమ్మాయికి అన్యాయం చెయ్యడం.. ఆ విషయం నీకు అర్థం అవుతుందా అని రేవతి అంటుంది.. నాకు ఈ ఇంట్లోనే ఒక దారి చూపించండని ముకుంద అనగానే.. అది ఎప్పటికి జరగదు.. సాటి ఆడదానిగా చెప్తున్నా.. అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండు, కృష్ణ మురారిలని అలా వదిలేయమని రేవతి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరొకవైపు కృష్ణ, మురారి వెళ్తుంటే దారిలో ఇద్దరు స్నేహితులు గొడవ పడుతుంటారు. ఏమైందోనని మురారి కార్ ఆపుతాడు. కృష్ణ, మురారి ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్లి.. ఏమైంది అని అడుగుతారు.. సర్ చాలా రోజుల నుండి మేం ఫ్రెండ్స్.. కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అంటే ఆ అమ్మాయేమో నువ్వు ఒక ఫ్రెండ్ మాత్రమే అంటుందని ఆ అబ్బాయి అంటాడు. లేదు సర్ నేను ఫ్రెండ్ గా మాత్రమే చూసానని ఆ అమ్మాయి అంటుంది. మరి మీ ఇద్దరు ముందు నుంచి ఒక క్లారిటీతో ఉండాలి కదా.. నువ్వు ప్రేమిస్తున్నట్లు అమ్మాయితో చెప్పావా అని అబ్బాయిని కృష్ణ అడుగగా.. చెప్పలేదని ఆ అబ్బాయి అంటాడు. నువ్వు అయిన ముందు నుంచి మనం ఫ్రెండ్స్ అని ఆ అబ్బాయి తో అన్నావా అని అమ్మాయిని మురారి అడుగుతాడు. కృష్ణ, మురారిల విషయం కూడా అలాగే ఉండడంతో ఒక్కసారిగా ఇద్దరు ఆలోచనలో పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.