English | Telugu

వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్ గా ‘బీబీ జోడి’ డ్యాన్స్ పర్ఫామెన్స్!

'బీబీ జోడి' శనివారం గ్రాండ్ గా మొదలైంది. వాలెంటైన్స్ వీక్ కావడంతో ఈ షో డబుల్ ఎంటర్‌టైన్మెంట్ ని తెచ్చేసింది. ఈ షోలో సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా ఉండగా.. శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. కాగా శనివారం నాటి డ్యాన్స్ ఎపిసోడ్ లో ధమాకా జోడీల పర్ఫామెన్స్ జరిగింది.


వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 11th ప్రామిస్ డే కాబట్టి మీరు ఏం ప్రామిస్ లు చేస్తారని శ్రీముఖి ధమాకా జోడీలని అడుగుగా.. తేజస్విని కప్పు తెచ్చిస్తానని అఖిల్ కి ప్రామిస్ చేస్తుంది. సేమ్ హియర్ అని అఖిల్ ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత కాజల్ ని అడుగగా.. "నేను చేసే డ్యాన్స్ లో స్టెప్స్ గుర్తుపెట్టుకుంటాను" అని కాజల్ ప్రామిస్ చేస్తుంది. ఆ తర్వాత సూర్య కళ్ళలోకి ఫైమా చూస్తూ.. "నువ్వే ప్రతీ ఎపిసోడ్‌లో నీ చేతులతో పట్టుకొని నన్ను గాల్లోకి లేపుతున్నావ్.. అలాగే ఈ షో ముగిసేలోపు నేను నిన్ను లేపుతా" అని చెప్పడంతో స్టేజ్ మీద ఉన్న మొత్తం కంటెస్టెంట్స్ నవ్వేసారు.

ఆ తర్వాత కొరియోగ్రఫీ రౌండ్ లో మొదట వచ్చిన జోడి కౌశల్ - అభినయశ్రీ. వీరిద్దరూ కలిసి ప్రభుదేవ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ ని ఎంచుకొని తమ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసారు. కాజల్-చైతూ జోడి బృంద మాస్టర్ కొరియోగ్రఫిని సెలెక్ట్ చేసుకొని వావ్ అనిపించేలా డ్యాన్స్ చేసారు. ఫైమా- సూర్య జోడి కలిసి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కి డ్యాన్స్ చేసి పర్వాలేదనిపించారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.