English | Telugu

ప్రసన్నగారు మీరింత వైల్డ్ అని తెలీదండి...బోల్డ్ డైలాగ్ వేసేసిన శ్రీముఖి

బుల్లితెర మీద శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ని పండిస్తోంది దాంతో పాటు బూతులు కూడా మస్త్ మాట్లాడి ఎంటర్టైన్ చేస్తుంది. నవరసాల్ని పండిస్తుంది అనే పేరు కూడా ఉంది. 'మిస్టర్ అండ్ మిసెస్' అనే రియాలిటీ షోకు హోస్ట్ గా చేస్తోంది. ప్రేమికుల రోజు రాబోతున్న సందర్భంగా 'లవ్ స్టోరి థీమ్' అంటూ కొత్తగా ఓ ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. దీని ప్రోమో చూస్తే ఫుల్ ఎనర్జిటిక్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ షోకి స్నేహ, శివ బాలాజీ జడ్జెస్ గా చేస్తున్నారు.

ఎప్పటిలాగే జడ్జెస్ ని షోలోకి ఇన్వైట్ చేసింది శ్రీముఖి. షోకి వచ్చిన జోడి కంటెస్టెంట్స్ కి హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పింది శ్రీముఖి. స్నేహ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చినప్పుడు జోర్దార్ సుజాత "మేడమ్ మీరు ప్రపోజ్ చేస్తే ప్రసన్న గారి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయో చెప్పరా" అని అడిగింది. ఇక స్నేహ భర్త ప్రసన్నగా శ్రీముఖి కాసేపు యాక్ట్ చేసింది "ఐ లవ్‌యూ కన్నమ్మా" అని శ్రీముఖి రొమాంటిక్ గా చెప్పేసరికి వెంటనే స్నేహ శ్రీముఖిని గట్టిగా హగ్ చేసేసుకుని అటూ ఇటూ ఊపేసి చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్లిపోతుంది.

దాంతో షాకైన శ్రీముఖి "ప్రసన్న గారు మీరింత వైల్డ్ అని తెలీదండి" అని ఒక బోల్డ్ డైలాగ్ వేసేసింది. ఇక అక్కడ ఉన్నవాళ్ళంతా నవ్వేశారు. ఈ ఎపిసోడ్‌లో ఉన్న జంటలన్నీ తమ పెర్ఫామెన్స్‌లతో ఎంటర్టైన్ చేసింది. ఒక్కో జంట ఒక్కోరకంగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. మరి ఈ లవ్ ఎపిసోడ్ లో ఎవరిని ఎలా ఇంప్రెస్ చేసుకున్నారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.