English | Telugu
‘పెన్ను కదలట్లేదురా సుధీర్, శీను.. వచ్చేయండిరా’
Updated : Jun 11, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ చరిత్రలో ఆడియన్స్ ఎప్పుడు నవ్వడమే చూసాం.. ఏడుపనేది తెలీకుండా స్కిట్స్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు కమెడియన్స్. కానీ ఈ వరం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ చూసి ఏడవని ఆడియన్ అంటూ ఎవరూ లేరు. ఎందుకంటే ఆటో రాంప్రసాద్ స్టేజి మీద ఏడ్చేసరికి టీం మొత్తం అతనికి అండగా నిలబడ్డారు. మేం ఉన్నాం నీ పక్కన ధైర్యంగా ఉండు అన్న అంటూ భరోసా ఇచ్చారు. ఐనా ఏడుపు ఆపులేకపోయాడు రాంప్రసాద్.
ఇంతలో ఇంద్రజ వెళ్లి రాంప్రసాద్ ని హగ్ చేసుకుని 'నువ్ జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్తావ్ మేము నిన్ను చూసి మా రాంప్రసాద్ అంటూ చెప్పుకుంటాం ఆ క్షణాలు త్వరలోనే వస్తాయి' అంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 'ఒక కంచంలో తిన్నాం ఒకే మంచంలో పడుకున్నాం. కానీ ఈరోజు నేను ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు నాతో ఉంటే అలా పక్కకెళ్లి స్కిట్ అరగంటలో రాసేసి తీసుకొచ్చేసేవాడిని అంత ధైర్యంగా ఉండేది నాకు. కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు గడుస్తున్నా స్కిట్ రాయలేకపోతున్న. నాకు ఫుడ్ పెట్టిన ఈ స్టేజి మీద బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా కానీ అస్సలు నా వల్ల కావడం లేదు.. పెన్ను కదలట్లేదురా.. ఎక్కడున్నా వచ్చేయండిరా సుధీర్, శీను' అంటూ స్టేజి మీద ఏడ్చేశాడు రాంప్రసాద్.
ఒకడు హీరోగా, ఒకడు మంచి ఆర్టిస్ట్ గా, నేను రైటర్ గా ఎప్పటికైనా కలుస్తాం అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు రాంప్రసాద్.. ఇక వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న మూమెంట్స్ ని ప్లే చేయడంతో రాంప్రసాద్ ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ స్కిట్ చాలా వైరల్ అవుతోంది. వీళ్లది రియల్ ఫ్రెండ్షిప్, సుధీర్, శీను మళ్ళీ ఈ స్టేజి మీద స్కిట్ చేయాలి, వీ మిస్ యూ సుధీర్ అన్న అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.