English | Telugu

అశ్విని కలలోకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంట!

అశ్విని శ్రీ ప్రస్తుతం అందరికి సుపరిచితమే. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్ గా ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటోస్ తో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ గా మారింది.

1989 జూలై 12 న అశ్విని శ్రీ జన్మించింది. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. అయితే మొదటగా తను షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. వాటితో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లోకి వచ్చింది. 2016 లో వెండితెరపై అరంగేట్రం చేసింది అశ్విని. సంపూర్ణేశ్ బాబు హీరోగా చేసిన "వినోదం 100 పర్సెంట్" అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ తర్వాత 2017 లో వచ్చిన "అమీర్ పేటలో", 2018 లో వచ్చిన " బిటెక్ బాబులు" , 2020 లో " నువ్వు నేను, ఒసేయ్ ఒరేయ్" వంటి సినిమాలల్లో నటించింది అశ్విని‌. అశ్విని ఇన్ స్టాగ్రామ్ లో చేసే రీల్స్, ఫోటోలకి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 498 K ఫాలోవర్స్ ని కలిగి ఉంది.

ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అశ్వినిశ్రీ ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. నాకైతే ఎక్కువ ఫీవర్ వస్తుంది. ఈ టైమ్ లో బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది. ఫిబ్రవరి 14 వస్తుంది కదా అందరు తమ లవర్ తో ఉంటారు. నాకు ఆ అదృష్టం లేదు. రాడ్ సింగిల్స్ కదా అని అంది. మీ కలలోకి పవన్ కళ్యాణ్ వస్తాడు కదా అని అడుగగా.. అవును, అప్పుడు అలా వస్తుంటాడని అశ్వినిశ్రీ అంది. భోలే షావలి మీ తొడల మీద పడుకున్నాడు కదా ఎలా ఉందని అడుగగా.. హౌస్ లో ఆ ఎమోషన్స్ కి తగ్గటుగా అలా ఉంటాం అంతేకానీ అదేమీ పర్సనల్ గా ఫీల్ అయ్యి చేసింది కాదు. సినిమా ఇండస్ట్రీలో మీలు ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారా అని అడుగగా.. అదేం లేదు. సినిమా ఇండస్ట్రీలో మనం చూసేది ఒక్క శాతం మాత్రమే కానీ లోపల దానికి మించి వంద జరుగుతాయి. ఏది పడితే అది చేయాలని ఎప్పుడు లేను. కొన్ని ప్రాజెక్ట్స్ చూసాను. అన్నింటికి అప్పుడు అడ్జస్ట్ అవ్వలేదు. చాలామంది ఓ వందసార్లు ఫోన్ చేసి‌. ప్లీజ్ ప్లీజ్ మీరే చేయాలి . మీరు మాత్రమే చేయగలరని వాళ్ళు అన్నాక కూడా అందులో ఓ రెండు చేశానంతే అని అశ్విని అంది‌. మీరు ఏ గేమ్స్ ఆడకుండా ఏడు వారాలున్నారని కొందరన్నారు దానికి మీరేమంటారని అడుగగా.. నాకైతే చాలామంది బాగా ఆడానాని చెప్పారు. స్పాంజ్ తో వాటర్ పట్టే టాస్క్ లో అంబటి అర్జున్ తో పోటీపడి ఆడాను. ఎగ్ టాస్క్ నా వల్లనే మా టీమ్ గెలిచిందిని అశ్విని అంది. ఇలా చాలా విషయాలని అశ్వినిశ్రీ షేర్ చేసుకుంది.