English | Telugu

సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నా..అషు ​​రెడ్డి

అషు ​​తాను ఒక మంచి సినిమాలో ఆఫర్ ని వదిలేసుకున్నాను అంటూ కాకమ్మ కథలు ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది. కాకమ్మ కథలు షోలో లాస్ట్ వీక్ గెస్టులుగా అష్షు-హరి వచ్చారు. ఐతే వీళ్ళ ఎపిసోడ్ 2 రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అష్షు ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "డోర్ దాకా వచ్చిన రోల్ ని మిస్ చేసిన సందర్భం ఉందా" అని హోస్ట్ తేజస్విని అడిగింది. అప్పుడు అషు ​​రెడ్డి "3 రోజెస్ అనే మూవీ రీసెంట్ గా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. నేను అందులో ఒక అమ్మాయిగా చేయాలంటూ ఆఫర్ వచ్చింది. ఆ మూవీ ప్రొడ్యూసర్ నన్ను రమ్మని అడిగారు. ఐతే నేను న్యూమరాలజీని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాను. డేట్స్ విషయంలో బాగా నమ్ముతాను.

ఆ డేట్స్ లో షూటింగ్స్ కి ఎవరైనా రమ్మన్నా ఆడిషన్ ఇమ్మాన్నా నేను కచ్చితంగా వెళ్ళలేను అని చెప్పలేను కాబట్టి డేట్స్ మార్చమని వాళ్ళను అడుగుతూ ఉంటాను. ఒక మంచి రోజు చూసుకుని వస్తానండి అని చెప్తాను. నీ కోసం మంచి రోజు చూసి ఆడిషన్స్ పెట్టాలా అంటారు. ఎందుకంటే వాళ్లకు ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉంటాయి. ఐతే ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఐతే ఆ ప్రొడ్యూసర్ నాకు స్ట్రిక్ట్ గా ఒక మెసేజ్ పెట్టారు. ఈ మూవీలో కచ్చితంగా మీరు ఉండాలి అని మేము అనుకుంటున్నాము అన్నారు. ఈ మూవీకి చాలా రీచ్ కూడా ఉంది. నేను రాను అని చెప్పేసరికి నా ప్లేస్ లో వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఆమె ఎవరో కాదు నా ఫ్రెండ్ . నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే ఈ మూవీ అవకాశం డోర్ వరకే కాదు కిచెన్ లోపలి వచ్చింది. కానీ నేనే ఈరోజు వద్దు రేపు రా అని చెప్పి పంపించేసా.." అంటూ చెప్పింది అషు ​​రెడ్డి. ఆమె బిగ్ బాస్ సీజన్ 3 తో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలో అష్షు రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. టీవీ షోస్, వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ ఉంటుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.