English | Telugu
Brahmamudi : అప్పుకి సపోర్ట్ గా పెద్దావిడ.. యామిని ప్లాన్ అదే!
Updated : Jun 29, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -760 లో.... యామిని దగ్గరికి అప్పు వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. మా అక్కని కిడ్నాప్ చెయ్యాలని ట్రై చేసింది నువ్వే అని నాకు తెలుసు యామిని.. మొన్న కూడా ఏదో సాక్ష్యం డిలీట్ చేశానని తప్పించుకున్నావ్.. కానీ నేను వదిలేస్తే నువ్వు తప్పించుకున్నావ్.. మా అక్క వదిలెయ్యమని చెప్పిందని అప్పు అనగానే యామిని షాక్ అవుతుంది. యామినికి అప్పు వార్నింగ్ ఇస్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు ఏంటి అప్పు ఇక్కడ ఉన్నావని రాజ్ అడుగుతాడు. ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చానని అప్పు అంటుంది.
నువ్వు కావ్యకి ప్రపోజ్ చేస్తానని వెళ్ళావ్ కదా బావ ఏమైందని రాజ్ ని యామిని అడుగగా.. ఏం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి నిన్ను బావని కలవకుండా చేస్తానని మాట్లాడుతుంది. తన మాటలకి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది. అప్పు వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం కావ్యకి చెప్తుంది యామిని. అప్పు రాగానే ఎందుకు వెళ్ళావని కావ్య కోప్పడుతుంది. ఇందిరాదేవి, అపర్ణ వచ్చి అప్పు చేసిన దాంట్లో తప్పేముందని అంటారు.
మరొకవైపు రాజ్ కంపెనీలోని ఒక బోర్డు మెంబర్ తో కలిసి యామిని మాట్లాడుతుంది. కావ్య గురించి నెగెటివ్ గా చెప్పండి. అప్పుడు కంపెనీ లో మీరు అనుకున్నది జరుగుతుందని యామిని అనగానే.. అతను యామిని చెప్పినట్లు చెయ్యడానికి సరే అంటాడు. ఆ తర్వాత కావ్యకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుంటే ఆఫీస్ నుండి ఫోన్ వచ్చి అర్జెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.