English | Telugu

బెస్ట్ యాక్టర్ గా మానస్ కి "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్  2025 "  

బుల్లితెర మీద బ్రహ్మముడి సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఈ సీరియల్ లో హీరో హీరోయిన్స్ గా మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీళ్ళు సీరియల్ లో కావ్య - రాజ్ గా బాగా పేరు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు కార్తీక దీపం సీరియల్ రాత్రి వచ్చేది. ఆ సీరియల్ ఐపోగానే ఆ టైం స్లాట్ లో ఈ బ్రహ్మముడి సీరియల్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ ఐన దగ్గర నుంచి కూడా మంచి రేటింగ్ ని తెచ్చుకుంది. అలాగే మానస్ ఇంకా దీపికా సీరియల్ తో పాటు రకరకాల షోస్ లో కూడా చేస్తూ ఉన్నారు. మానస్ శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఆదివారం విత్ స్టార్ మా పరివారానికి వస్తున్నాడు. అలాగే ఇప్పుడు జబర్దస్త్ కి కో- యాంకర్ గా చేస్తున్నాడు. దీపికా కూడా ఈ షోస్ లో కనిపిస్తూ ఉంటుంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో దీపికా - మానస్ ఇద్దరూ మెంటార్స్ గా వచ్చారు. ఇక దీపికా ఐతే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి సమీరా భరద్వాజ్ తో కలిసి వచ్చింది. ఐతే డాన్స్ ఐకాన్ తర్వాత దీపికా షోస్ లో కనిపించడం తగ్గింది. రీల్స్ మాత్రం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడుతోంది.

ఇక ఇప్పుడు "బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ తెలుగు 2025 ఫర్ బ్రహ్మముడి" సీరియల్ కి మానస్ నటనకు గాను "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ 2025 " అవార్డుని అందుకున్నాడు. సీరియల్స్ లో బెస్ట్ ఐకానిక్ తెలుగు షోగా బ్రహ్మముడి సీరియల్ నిలిచిందంటూ ఈ సంస్థ పేర్కొంది. ఇక హీరోయిన్ దీపికా మానస్ ని విష్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టింది. సీరియల్ లో పద్దతిగల కోడలిగా కనిపించే దీపికా రీల్స్ లో, షోస్ లో చేసే హడావిడి, అల్లరి మాములుగా ఉండదు. ఆమె ఉంటే చాలు షో రేటింగ్స్ పీక్స్ అన్న టైంలో మరి కొంచెం అమ్మడి హవా ఐతే తగ్గింది.