English | Telugu

గెస్ ది లొకేషన్ అంటున్న గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-6 లో బాగా గుర్తుండేది కొందరే ఉన్నారు. అందులో మొదటగా వినిపించే పేరు గీతు రాయల్. చిత్తూరు చిరుతగా హౌస్ లోకి అడుగుపెట్టిన గీతు.. తన మార్క్ గేమ్ ప్లాన్ తో, స్ట్రాటజీస్ తో కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడుకుంది. తనకి గేమ్ రూల్స్ అన్నీ తెలుసు.. అందుకే మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేసేది. గీతు రాయల్ కి క్రేజ్ మాములుగా ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే తను ఎలిమినేషన్ అయిందో అప్పటినుండి తనని విమర్శించిన వారు కూడా పాజిటివ్ గా స్పందించారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ లో అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గీతు రాయల్.

'బ్యూటీ క్వీన్' అని శ్రీసత్యని చెప్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్.. శ్రీసత్య వెంటే ఉంటూ తన లవ్ కోసం చాలా ప్రయత్నించి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చేశాడు. ఇటీవల శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ఈ సెలబ్రేషన్స్ లో రాజ్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, ఫైమా, రేవంత్, యాంకర్ శివ ఇలా చాలా మంది హాజరయ్యారు. అందరూ సరదాగా గడుపుతూ శ్రీసత్యతో సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో అందరి దృష్డి అర్జున్ కళ్యాణ్ మీదే ఉంది. అతనితో శ్రీసత్య ఎలా ఉంటుందా అని ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే శ్రీసత్య మాత్రం అందరితో ఉన్నట్టే మామూలుగా ఉంది. అయితే గీతు రాయల్.. ఈ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉండి అందరిలో మంచి జోష్ ని నింపింది.

శ్రీసత్య పుట్టిన రోజు వేడుకల్లో కలిసిన బిగ్ బాస్-6 కంటెస్టెంట్స్ అందరూ సరదగా ఎంజాయ్ చేశారు‌. అయితే బిగ్ బాస్ తర్వాత ఎవరి బిజీ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. రేవంత్ కొత్త ఆల్బమ్స్ కోసం బిజీ అయ్యాడు. శ్రీహాన్ యాక్టింగ్ లో బిజీ, ఆదిరెడ్డి ఎప్పటిలాగే వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గీతు రాయల్, శ్రీసత్య, వాసంతి కృష్ణన్ కలిసి టూర్ కి వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది గీతు రాయల్. అయితే వాళ్ళు వెళ్తున్న లొకేషన్ ఏంటో చెప్పడంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో అడిగింది గీతు. కాగా శ్రీసత్య కూడా గీతుని ట్యాగ్ చేసి ... లవ్ యూ గీతు రాయల్ అని పోస్ట్ చేసింది. ఇలాగే వాసంతి కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళు ముగ్గురు కలిసి గడుపుతున్న మెమొరీస్ ని షేర్ చేసింది. కాగా బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ ఇలా కలవడంతో ఈ సీజన్ అభిమానులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఈ ముగ్గురు చేసే పోస్ట్ లకి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.