English | Telugu
వసంతి లైవ్ చాట్ లోకి అర్జున్ కళ్యాణ్.. విన్నర్ ఎవరు అని చర్చ!
Updated : Nov 19, 2022
బిగ్ బాస్ సీజన్ సిక్స్ తుది దశకు చేరుకుంది. కాగా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఒక్కో కంటెస్టెంట్ ఈ సీజన్ విజేతలు ఎవరు? అని వారి వారి అభిప్రాయాలు చెబుతున్నారు. అలా చెప్తున్న వారిలో రీసెంట్ గా బయటకొచ్చిన వసంతి..తన Instagram లైవ్ లోకి వచ్చి, బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. కాగా ఈ చాట్ లో అర్జున్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడు.
వసంతి లైవ్ చాట్ కి వచ్చి తన ఫాలోవర్స్ కి, తను హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి థాంక్స్ చెప్పింది. ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మొదటగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కో హౌస్ మేట్ గురించి చర్చించుకున్నారు.
"అకార్డింగ్ టు యు ఎవరు గెలుస్తారు" అని వసంతి, అర్జున్ ని అడిగింది. దానికి అర్జున్ మాట్లాడుతూ " ఇంకెవరు..రేవంతే" అని అన్నాడు. ఆ తర్వాత " రేవంత్, ఇనయా ఇద్దరికి నా సపోర్ట్ " అని వసంతి అంది. " ఆల్ మై ఫ్రెండ్స్ హావ్ మై సపోర్ట్ ..ఒక్కరు అని చెప్పలేను. రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ వీళ్ళు నలుగురు టాప్ ఫై లో ఉంటారు అని అనుకుంటున్నాను. వీళ్ళు నలుగురు పక్కా ఉంటారనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ పొజిషన్ కోసం కీర్తి, ఫైమా, ఆదిరెడ్డి వీళ్ళ ముగ్గురి మధ్య కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది అని అనుకుంటున్నా " అని అర్జున్ చెప్పాడు. "కీర్తి ఇండివిజువల్ ప్లేయర్. అందులో కూడా..సో యూ హావ్ టూ సపోర్ట్ హర్. ఇండివిజువల్ ప్లేయర్స్ ఎవరు అయితే లోపల ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఇండివిజువల్ ప్లేయర్ నుండే నేను వచ్చాను. ఆ బాధేంటో నాకు తెలుసు. సో కీర్తి టాప్ ఫై లో ఉండాలి అని కోరుకుంటున్న " అని వసంతి అంది. దానికి అర్జున్ "యా..షీ విల్ బి" అని అన్నాడు. అలా వసంతి, అర్జున్ లా లైవ్ చాట్ ముగిసింది.