English | Telugu
టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అంబటి అర్జున్!
Updated : Dec 2, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరి అంచనాలకు అందకుండా అంబటి అర్జున్ ఆడి గెలిచాడు. ఎవరినీ ఒక్క పాయింట్ కూడా అడుగకుండా ' టికెట్ టూ ఫినాలే ' కి అర్హత సాధించిన తొలి హౌస్ మేట్ గా అంబటి అర్జున్ నిలిచాడు.
గ్రాంఢ్ లాంచ్ 2.0 లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రి ఇచ్చిన కంటెస్టెంట్ అంబటి అర్జున్. ఆటలో తప్ప బయట పెద్దగా ఎవరితోను మాట్లాడకుండా అవసరానికి మించి ఏమీ చేయడు అన్నట్టుగా ఉంటూ వస్తున్నాడు అంబటి అర్జున్. 'టికెట్ టు ఫినాలే' కోసం హౌస్ లోని ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా గత వారం రోజుల నుండి టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. తొలి టాస్క్ లో శోభాశెట్టి, శివాజీ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నారు. వారిద్దరు కలిసి తమ పాయింట్లను అమర్ దీప్ కి ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక రేస్ నుండి తప్పుకొని తన పాయింట్లని గౌతమ్ కి ఇచ్చింది. ఇక కొన్ని టాస్క్ ల తర్వాత యావర్ లీస్ట్ లో ఉండగా అతని పాయింట్లని పల్లవి ప్రశాంత్ కి ఇచ్చాడు. ఇక గౌతమ్ కృష్ణ లీస్ట్ లో ఉండి తన పాయింట్లని అమర్ దీప్ కి ఇచ్చాడు. ఈ పాయింట్లని ప్రియాంక ఇస్తున్నట్టు, ఇంకెప్పుడు ప్రియాంకని ఇవ్వలేదని సపోర్ట్ చేయలేదని అనకు అంటూ గౌతమ్ చెప్పాడు.
ఇక ఫైనల్ గా అమర్, అర్జున్, ప్రశాంత్.. ఈ ముగ్గురు ఉండటంతో కండబలం నిరూపించుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో అర్జున్ ఒక చేతితో అమర్ దీప్ ని, మరో చేత్తో పల్లవి ప్రశాంత్ ని లాగి పరేశాడు. ఒక దగ్గర అర్జున్ ఆగితే అవతలి నుండి ఇద్దరు కలిసి లాగినా కదలట్లేదు. అంత కసిగా ఆడాడు అంబటి అర్జున్.. ఇక ఈ టాస్క్ లో పది జెండాలని బుట్టలో వేసి విజేతగా నిలిచాడు అర్జున్. రెండు జెండాలు బుట్టలో వేసి రెండవ స్థానంలో అమర్, ఒక్క జెండాని బుట్టలో వేసి ప్రశాంత్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత లీస్ట్ స్కోర్ గా ఉన్న ప్రశాంత్ టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకున్నాడు. ఇక అమర్‌దీప్, అర్జున్ లకి స్నేక్ మీద స్నూకర్ బాల్ ని, రోప్ ల సహాయంతో వేలాడే వేలాడే వుడ్ తో మెల్లిగా పై వరకు తీసుకెళ్ళి గోల్ఫ్ చేయాలని బిగ్ బాస్ చెప్పగా.. అందులో అర్జున్ గెలిచాడు. దాంతో ఫినాలే అస్త్రని సాధించిన మొదడి హౌస్ మేట్ గా అంబటి అర్జున్ నిలిచాడు.