English | Telugu
పెద్ద హీరోతో సినిమా తీస్తున్న బులెట్ భాస్కర్..
Updated : Dec 2, 2023
"ఆలీతో ఆల్ ఇన్ వన్ " ఈ వారం షోకి జబర్దస్త్ టీమ్ బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, వర్ష వచ్చారు. ఆలీ వాళ్ళతో ఎన్నో విషయాలు మాట్లాడించాడు. భాస్కర్ కూడా కొన్ని ఇంటరెస్టింగ్ పాయింట్స్ ని ఈ షోలో షేర్ చేసుకున్నాడు. భాస్కర్ తో కొన్ని స్టెప్స్ వేయించాడు ఆలీ. కానీ అవి నాన్ సింక్ అయ్యాయి..దాంతో ఆలీ "నీకు జిమ్ బాగా వచ్చు" అనేసరికి "డాన్స్ మాత్రం అస్సలు రాదు" అన్నాడు భాస్కర్. "యాక్టింగ్ అంటే భయమా, డాన్స్ అంటే భయమా" అని అడిగేసరికి "డాన్స్ అంటే చాలా భయం ఎందుకంటే తీగలన్నీ తెగిపోయాయి" అని కామెడీ డైలాగ్ చెప్పి ఆలీని నవ్వించాడు. "డాన్స్ రేపు షూటింగ్ ఉంది అనగా సాయికుమార్ కి కూడా ఇలాగే జ్వరం వచ్చేసింది" అని గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని భాస్కర్ కి చెప్పాడు. "ప్రస్తుతం ఎం చేస్తున్నావ్" అని ఆలీ అడిగేసరికి "డైరెక్షన్ వైపు ట్రై చేస్తున్నాను.
ఒక ఐదారు కథల్ని రెడీగా పెట్టుకున్నా..ఐతే పెద్ద హీరోతో వెళదామని వెయిట్ చేస్తున్నా....చాలా మంది పెద్ద హీరోస్ కి కథలు వినిపించాను...కానీ ప్రస్తుతం వాళ్ళ పేర్లు చెప్పను..వాళ్ళు ఓకే అన్నాక రివీల్ చేస్తాను" అని చెప్పాడు భాస్కర్. "ఎలాంటి మూవీ తీద్దామనుకుంటున్నావ్" అని అడిగేసరికి "నాకు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కానీ ముందు ఒక మూడునాలుగు కోట్లు పెట్టి ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ తీసి ఒక వంద కోట్లు కొట్టి..తర్వాత పెద్ద మూవీ చేయాలని ఆలోచన ఉంది. అంటే ప్రొడ్యూసర్ కూడా సేఫ్ గా ఉండాలి కదా అందుకే . ఇంతలో ఎవరో ప్రొడ్యూసర్ నన్ను పెట్టి సినిమా తీస్తాను అని ముందుకొచ్చాడు..నాయన నా పెళ్ళామే గట్టిగా గంట సేపు నా ముఖం చూడదు..మూడు గంటల సేపు జనాలు నా ముఖం ఎందుకు చూస్తారు...డబ్బులుంటే కిరాణా కొట్టు పెట్టుకో.." అని చెప్పాను అన్నాడు భాస్కర్.