English | Telugu

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివాజీ!

బాస్ సీజన్-7 లో టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ శివాజీ. తన ఆటతీరుతో, మాటతీరుతో టాప్-5 లో ఒకడిగా ఉంటు వస్తున్నాడు శివాజీ. అయితే నాల్గవ వారం జరిగిన టాస్క్ లో శివాజీ చేతికి బలంగా గాయమైంది. అయితే ఆ వయసులో శివాజీ గేమ్ లో చూపించిన ఆసక్తికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పటినుండి శివాజీ తన చేతినొప్పి ఇబ్బంది పెడుతున్న మేనేజ్ చేస్తున్నాడు.

అందరు ఈ సీజన్ శివాజీనే విన్నర్ అని అంటున్నారు. కామన్ మ్యాన్ కి అండగా ఉన్నాడు. అన్ని సినిమాలు చేసినగానీ ఏ మాత్రం ఇగో లేకుండా అందరితో కలిసిపోతు ఉన్నాడు. గతవారం శివాజీ బయటకి వెళ్ళడంతో అందరు ఎలిమినేటెడ్ అయ్యాడని అనుకున్నారు. కానీ చేతినొప్పి కోసం మెడికల్ టెస్ట్ లకు తీసుకెళ్ళారని తర్వాత తెలిసింది. ఇక హౌస్ లోకి మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చిన శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ప్రతీ గేమ్ లో యాక్టివ్ గా ఉంటూ తన తోటి హౌస్ మేట్స్ కి వెన్నంటే ఉంటున్నాడు.

ఇప్పుడు నామినేషన్లో ఉన్న శివాజీకి ఏ అనఫీషియల్ ఓటింగ్ పోల్ లో చూసిన శివాజీ అత్యధిక ఓటింగ్ శాతంతో నెంబర్ వన్ లో ఉంటున్నాడు. హౌస్ మేట్స్ అందరికీ కలిపి 50శాతం ఓటింగ్ జరిగితే శివాజీ ఒక్కడికే 50 శాతం ఓటింగ్ అనేది జరుగుతోంది. ప్రతి అనఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా శివాజీనే టాప్ లో ఉన్నాడు. ఓటింగ్ లో మొనగాడిలా దూసుకుపోతున్నాడు. ఇదే చివరిదాకా కొనసాగితే గ్రాంఢ్ ఫినాలేలో కూడా శివాజీ మొదటి స్థానంలో ఉండి టైటిల్ బిజేత అయ్యేలా ఉన్నాడు. అయితే శివాజీ ప్రస్తుతం చేతి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అది సెట్ అవుతే శివాజీకి హౌస్ లో తిరుగులేదనేది వాస్తవం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.