English | Telugu
సుధా రాజ్ పుత్ గుట్టు తెలుసుకున్న ఆర్యవర్థన్
Updated : Jun 1, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని నెలలుగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా ఈ ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. `బొమ్మలరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రామ్ జగన్, జయలలిత, అనూషా సంతోష్, రాధాకృష్ణ, కరణ్, సందీప్, జ్యోతిరెడ్డి, మధుశ్రీ నటించారు.
రఘుపతి తను మీడియాకు ఇచ్చిన సీడీ ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో నని తాను ఆ తప్పు చేయలేదని సుధా రాజ్ పుత్ ఇదంతా చేస్తోందని ఆర్య వర్ధన్ కు చెప్పాలని ఆర్య ఇంటికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో కొబ్బరి బోండాం తాగడానికి ప్రయత్నిస్తుంటే రాగసుధ మనిషి వశిష్ట అతనికి కొబ్బరినీళ్ల బాటిల్ లో ఏదో మందు కలపి ఇస్తాడు. అది తాగుతూ ఆర్య ఇంటికి చేరుకున్న రఘుపతికి మాట పడిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆర్య వర్ధన్ ముందు సుధా రాజ్ పుత్ బండారం బయటపెట్టాలని ప్రయత్నించినా ఫలితం వుండదు.
తను చెప్పాలనుకున్న విషయాన్ని పెన్ను పేపర్ ఇస్తే రాస్తానని రఘుపతి సైగ చేయడంతో అందుకు అను రెడీ అవుతుంది. కానీ సుధా రాజ్ పుత్ వేశంలో వున్న రాగసుధ అడ్డుతగిలి రఘుపతి ఏం చెబుతున్నాడో తనకు తెలుసు అని చెప్పి మాట మారుస్తుంది. అక్కడి నుంచి రఘుపతి వెళ్లిపోయేలా చేస్తుంది. కట్ చేస్తే.. ఆర్యకు సంబంధించిన సీడీని మార్చి మీడియా ఛానల్ వాళ్లు బ్రేకింగ్ న్యూస్ కింద న్యూసెన్స్ ని క్రియేట్ చేయబోతున్నారని జెండే కు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్యకు వివరించి సదరు ఛానల్ లో న్యూస్ టెలీకాస్ట్ కాకుండా చేస్తారు.
ఆ తరువాత సదరు ఛానల్ వారి నుంచి సీడీని మరొకరు ఎత్తుకెళ్లారని తెలియడంతో జెండే మిగతా ఛానల్ లని హెచ్చిరించే పనిలో వుంటాడు. ఇదే సమయంలో సుధా రాజ్ పుతే రాగసుధ అనే విషయం తనకు తెలిసిందని ఆర్య వర్ధన్ చెప్పడం తో జెండే షాక్ గురవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? .. అనుని రాగసుధ పోలీస్టేషన్ కి ఎందుకు రమ్మంది?.. తనని అడ్డు పెట్టుకుని ఏం చేయబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.