English | Telugu
రాగసుధ కు చుక్కలు చూపించిన అను
Updated : Jun 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులతో , ట్విస్ట్ లతో సాగుతున్న ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ వారం ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె ప్రధాన జంటగా నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, విశ్వమోహన్, రామ్ జగన్, అనూషా సంతోష్, జ్యోతిరెడ్డి, రాధాకృష్ణ, కరణ్, ఉమాదేవి, మధుశ్రీ, సందీప్ నటించారు. ఆర్య వర్థన్ అరెస్ట్.. మూడు రోజుల కస్టడీ తో కథ కీల మలుపు తిరిగింది.
రాగసుధ మాస్టర్ ప్లాన్ కారణంగా ఆర్య వర్థన్ ని మూడు రోజుల పోలీస్ కస్టడీకి గవర్నర్ ఆదేశాలు జారీ చేస్తాడు. దీంతో చేసేది లేక ఆర్య ఇందుకు తాను సహకరిస్తానని చెప్పి సంబంధింత పేపర్లపై లాయర్ చెప్పనట్టుగా సంతకాలు చేస్తాడు. ఇక అతన్ని సెల్ వైపు తీసుకెళుతుంటే అది భరించలేని అను పక్కనే వున్న ఓ పోలీస్ నుంచి గన్ ని లాక్కుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ బెదిరించడానికి ట్రై చేస్తుంది. అయితే ఆర్య వర్థన్ వారించడంతో చివరికి గన్ పడేస్తుంది. ఇక స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లమని ఆర్య చెప్పడంతో నీరజ్ ని ఇంటికి వెళ్లమని, తాను ఆఫీస్ కి వెళతానని చెప్పిన అను ఆవేశంగా రాగసుధ వున్న ఇంటికి వెళుతుంది.
ఆర్యని మరీ పతనావస్థకు తీసుకురావాలని, ప్రస్తుతం అయితే ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తానని వశిష్టతో రాగసుధ చెబుతూ వుంటుంది. అదే సమయానికి అను ఎంట్రీ ఇచ్చి షాకిస్తుంది. నీ నిజస్వరూపమేంటో తెలిసిపోయింది. నా నమ్మకాన్ని చంపేశావ్..తోడబుట్టిన అక్క అని కూడా జాలి లేకుండా చంపేశావ్.. అని రాగసుధపై అరుస్తుంది అను. వాయిస్ క్లిప్స్ విన్న తరువాత కూడా నువ్విలా మాట్లాడ్డం ఏమీ బాగాలేదంటుంది రాగసుధ. నిజంగానే ఆర్య వర్థన్ హంతకుడు అంటుంది. వెంటనే అను ఆగ్రహంతో నోర్ముయ్... నీకు భమం అంటే ఏంటో చూపిస్తాను. అంటూ రాగసుధ చెంపలు వాయిస్తుంది.. వెంటనే రాగసుధ పీకపట్టుకుంటుంది అను. ఆ తరువాత ఏం జరగబోతోంది?.. కథ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.