English | Telugu

మెగాస్టార్ ని హత్తుకున్న అనిల్ జీలా.. వీడియో వైరల్!

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మహాపురుషులవుతారని అలనాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పగా.. ఇప్పుడు కొందరు హీరోలు నటులు నిరూపిస్తున్నారు. కొణిదెల చిరంజీవి గారు తన స్వయంకృషితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలాంటి స్టార్ ని ఓ యూట్యూబర్ కలిసి మాట్లాడటంతో పాటు హత్తుకోవడం అంటే ఎంత గ్రేట్. మరి అతనెవరో కాదు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన అనిల్ జీలా. నిన్న జరిగిన ఓ సదస్సులో మెగాస్టార్ ని కలిసిన అనిల్ జీలా తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని షేర్ చేశాడు.

అనిల్ జీల హలో వరల్డ్ తో చాలా మంది కి పరిచయం అయినా ఒక యూ ట్యూబర్... ప్రస్తుతం సోషల్ మీడియాలో మై విలేజ్ షో అనిల్ జీల అండ్ టీమ్ హవా నడుస్తుంది. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ జీల ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు చేయడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి. నిన్నటి సదస్సులో మెగాస్టార్ ని అనిల్ జీలా కలిసాడు. " నువ్వు అనిల్ జీలా కదా.. యూట్యూబ్ లో మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తుంటాను " అని చిరంజీవి చెప్పాడంటూ తను షేర్ చేసిన వీడియోలో అనిల్ జీలా రాసుకొచ్చాడు. అయితే ఇప్పుడు నెట్టింట ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..