English | Telugu
ఎన్ని పెగ్గుల తర్వాత ఇలా.. శ్రీరామ్, సన్నీ పరువు తీసేసిన యాని మాస్టర్
Updated : Jul 7, 2022
ఫేమస్ బ్యాక్ గ్రౌండ్ సింగర్ ఇంకా నేపథ్య గాయకుడు, రియాలిటీ టీవీ స్టార్ శ్రీరామ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆయన ఇటీవల తన బాయ్స్ టీమ్ తో కలిసి సరదాగా శ్రీశైలం ట్రిప్ కి వెళ్ళాడు. ఎప్పుడు కనిపించే వేషధారణలో కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా చాలా ట్రెడిషనల్ గా పట్టు పంచెలతో, చొక్కాలతో రోడ్డు మీద నిలబడి రకరకాల ఫోజులతో కనిపించి సందడి చేశారు. అలా తన బాయ్స్ టీంతో కలిసి వెళ్లిన శ్రీశైలం ట్రిప్ ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు శ్రీరామచంద్ర. దీంతో పాటు విజె సన్నీతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసుకున్నారు. "మామ మనం కలిసి చాలా కాలం అయ్యింది. ఇంత కాలానికి ఇలా నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది డార్లింగ్. నీ రాబోయే ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ " అని కాప్షన్ పెట్టాడు శ్రీరామ్ . ఇక ఈ పోస్ట్ కింద యాని మాస్టర్ "ఎన్ని పెగ్గుల తర్వాత ఇలా మాట్లాడుకున్నారు" అంటూ కామెంట్ పెట్టి ఇద్దరి పరువు తీసి పారేశారు.
]ఓటిటి వేదికపై శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా పోటీ చేసాడు. తెలుగు ఇండియన్ ఐడల్ షోకి మేకర్స్ హోస్ట్ గా శ్రీరామ్ ని ఎంచుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇక శ్రీరామచంద్ర 2013 లో హిందీ ఇండియన్ ఐడల్ గెలిచి సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన గాత్రానికి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కూడా ఫిదా ఐపోతారు. శ్రీరామా చంద్రకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. షోస్ తో ఫుల్ బిజీ గా ఉండే శ్రీరామ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ తో టచ్ లో ఉంటూ క్రేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు.