English | Telugu
శ్రీహాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన షణ్ముఖ్
Updated : Dec 16, 2021
గత కొన్ని రోజులుగా నెటిజన్ లకి అడ్డంగా దొరికి పోయి తనని తానే తగ్గించుకుంటూ టార్గెట్ అవుతున్నాడు షణ్మఖ్. కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ ఎపిసోడ్ కోసం బిగ్‌బాస్ స్టేజ్ పై సిరి ప్రియుడు శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిరితో మాట్లాడిన శ్రీహాన్ ఆ తరువాత హౌస్ లో వున్న వాళ్లకు నెంబర్ లు కేటాయించమన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీహాన్ .. షన్నుకి గట్టి ఝలకే ఇచ్చాడు.
Also Read:బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించని స్టార్స్
అతన్ని పక్కన పెట్టి సన్నీకి నెం.1 ఇచ్చాడు. ఆ తరువాత వచ్చిన సిరి తల్లి కూడా షన్నుని హగ్గుల విషయంలో ఓ రేంజ్ లో చుక్కలు చూపించి హగ్గులు అతిగా వున్నాయని షన్నుకు చురకలంటించింది. ఇదే అంశాన్ని తాజా ఎపిసోడ్ లో పాయింగ్ అవుట్ చేస్తూ షన్ను మళ్లీ సిరిని టార్చర్ చేయడం మొందలుపెట్టాడు. షన్నుకి సంబంధించిన జర్నీ వీడియోని చూపించిన ఎపిసోడ్ సమయంలో సిరి, షన్నుల మధ్య జరిగిన అన్ సీన్ వీడియో తాజాగా బయటికి వచ్చింది.
ఈ వీడియోలో షన్ను.. సన్నీని టార్గెట్ చేయడమే కాకుండా శ్రీహాన్ పై చిందులు తొక్కడం అభిమానులని షాక్ కు గురిచేస్తోంది. నాపై నీకు రెస్పెక్ట్ వుందన్నది చేతల్లో కనిపించదు మాటలే తప్ప అని సిరి అంటుంది. అంతే కాకుండా సన్నీ మాటల్లో.. చేతల్లో నా పై రెస్పెక్ట్ ని చూపించాడని చెబుతుంది. దీంతో షన్ను రగిలిపోయి శ్రీహాన్ పై విషయం వెళ్ళగక్కాడు. శ్రీహాన్ .. సన్నీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. సన్నీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చావ్.. ఇలాగే తనని ఎంకరేజ్ చేయి అని చెప్పు.. అని షన్ను ఫైర్ అయి ఆడియన్స్ ముందు మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. మరో మూడు రోజుల్లో బిగ్‌బాస్ ముగియ నున్న నేపథ్యంలో షన్ను తన టెంపర్ మెంట్ తో సెల్ఫ్ గోల్ చేసుకోవడం గమనార్హం.