English | Telugu
బిగ్ బాస్ హౌస్‌లోకి ఉదయభాను?
Updated : Jul 25, 2022
బిగ్ బాస్ సీజన్ 6 ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలామంది ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. బుల్లి తెర షోస్ నుంచి చాలామందిని ఇప్పటికే కాంటాక్ట్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఐతే ఇప్పుడు ఈ హౌస్ లోకి ఉదయభాను ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. ఇంకా కొంతమందిని కలిసి ఓకే చెప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
కరోనా కారణంగా బిగ్ బాస్ 4, 5లో చాలావరకు కొత్త ఫేసెస్ కనిపించాయి. ఐతే ఆడియన్స్ కోరిక మేరకు ఫేమస్ ఫేసెస్ ని తీసుకొచ్చి ఈసారి షోని నిర్వహించాలని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. అందుకే స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ కి చెందిన పాపులర్ యాక్టర్స్ ని, యాంకర్స్ ని కాంటాక్ట్ చేస్తున్నారట. ఉదయభానుతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నారట.
గతంలోనే ఉదయభాను బిగ్ బాస్ లో పాల్గొనాల్సి ఉండింది. ఐతే అప్పుడు పెద్దగా ఇంటరెస్ట్ చూపించని భాను ఇప్పుడు రావాలని చూస్తోంది.. అలాగే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా భానుని తీసుకురావాలని చూస్తున్నారు.ఈమెకు మంచి రెమ్యూనరేషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. అన్ని ఓకే ఐతే గనక బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం.
ఉదయభాను సీనియర్ యాంకర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి షోకి మంచి టీఆర్పీ వచ్చే అవకాశం ఉందని బిగ్ బాస్ మేకర్స్ భావిస్తున్నారు. 'లీడర్', 'జులాయి' మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో ఉదయభాను ఫుల్ జోష్ గా డాన్స్ వేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. ఐతే లైఫ్ లో కొన్ని అనుకోని ఇష్యూస్ రావడంతో ఉదయభాను స్మాల్ స్క్రీన్ కి దూరమయ్యింది. కానీ కొంతకాలానికే తేరుకుని మళ్ళీ షోస్ కి యాంకర్ గా వచ్చేసింది. అప్పట్లో సుమతో సమానంగా యాంకర్‌గా పాపులర్ అయ్యింది భాను.