English | Telugu

పిలవని పేరంటానికి వెళ్లిన ఇంద్రజ..సుమకి రెమో షాక్


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి బూట్ కట్ బాలరాజు టీమ్ వచ్చి సందడి చేసింది. హీరో, హీరోయిన్స్ మేఘ లేఖ - సోహైల్, ఇంద్రజ- అవినాష్ వచ్చారు. "రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని బూట్ కట్ బాలరాజులో చూపించాం" అని సోహైల్ అనేసరికి అంటే "నువ్వు చేసేవన్నీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉంటాయా..అంటే మొన్న చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడానా" అనేసరికి "అమ్మో ప్రెగ్నెంట్ కాదక్కో" అన్నాడు సోహైల్ సరదాగా.

తర్వాత అవినాష్ ని పిలిచి "పిలవని పెళ్ళికి మీరెప్పుడైనా వెళ్లి భోజనం చేశారా" అని సుమ అడిగింది. " అవును వెళ్లాం మాతో పాటు ఇంద్రజ గారు కూడా వచ్చి భోజనం చేశారు" అని అవినాష్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఇంద్రజ, సోహైల్, అవినాష్ కలిసి అతడు మూవీ సీన్ ని స్పూఫ్ గా చేసి చూపించి కాసేపు ఫన్ జెనెరేట్ చేశారు. అవినాష్ నాజర్ రోల్ లో, సోహైల్ మహేష్ బాబు రోల్ లో డైలాగ్స్ చెప్పారు. సోహైల్ సరిగా మాట్లాడలేక డైలాగ్ సరిగా చెప్పకపోయేసరికి "పార్థు ఈరోజు వాష్ రూమ్ కి వెళ్లాడా లేదా" అని కౌంటర్ వేసాడు అవినాష్.

దానికి సోహైల్ కి ఏం చెప్పాలో తెలీక సైలెంట్ గా ఉన్నాడు. ఇంద్రజ, సుమ పడీపడీ నవ్వేశారు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీలో కొన్ని సీన్స్...రాళ్లను, కుండల్ని పగలగొట్టి కాసేపు ఎంటర్టైన్ చేశారు అవినాష్, సోహైల్. "నాలాంటి అందమైన అమ్మాయిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది" అని రెడ్ రోజ్ పట్టుకుని అవినాష్ ని సుమ అడిగేసరికి అపరిచితుడిలా నటించి సుమకి షాకిచ్చాడు. ఇలా ఈ వారం సుమా అడ్డా షో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.