English | Telugu

ఊరికే అనలేదు డాక్టర్ బాబు అని ఈ వయసులోనే ఇలా ఉంటే...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ స్పెషల్ ఈవెంట్ ని సెలెబ్రేట్ చేశారు. ఫస్ట్ జోడిగా నిరుపమ్-మంజుల పరిటాల జోడి వచ్చింది. "ఎన్ని సంవత్సరాలైంది మీ పెళ్లై" అని మంజులని అడిగింది శ్రీముఖి. "13 ఏళ్ళు అయ్యింది" అని చెప్పింది. "సరే మీ పెళ్లి రోజు ఎప్పుడు.." అని నిరుపమ్ ని అడిగింది శ్రీముఖి "అక్టోబర్ 2 " అని చెప్పేసరికి "అది గాంధీ జయంతి కదా సర్" అంటూ వెనక నుంచి హరి కోరస్ గా అనేసరికి మంజుల కూడా సీరియస్ గా చూసింది.. దాంతో వెంటనే డాక్టర్ బాబు "అక్టోబర్ 3 " అని ఆన్సర్ కరెక్ట్ చేసుకుని చెప్పాడు. తర్వాత అమర్ దీప్- తేజు జోడి వచ్చి రెడ్ రోజెస్ ని ఎక్స్ చేంజ్ చేసుకున్నారు.

ఇక స్టెల్లా-యాదమ్మ రాజు వచ్చారు. స్టెల్లా డ్యూయెట్ స్టెప్ వేయించాడు కానీ సరిగా రాలేదు...దాంతో హరి కౌంటర్ ఇచ్చాడు "స్టెల్లాని తప్పా ఎవరినైనా బాగా తిప్పుతాడు" అనేసరికి యాదమ్మ రాజు నవ్వేసాడు. తర్వాత ప్రియాంక జైన్- శివ్ కుమార్ వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కలిసుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఐతే శ్రీముఖి "ఇదిగో సిద్దూవిష్ణు పెళ్లి చేసుకున్నారు బేబీ ఉంది, అమర్ - తేజు పెళ్లయింది..త్వరలో బేబీ రాబోతోంది. మంజుల-నిరుపమ్ కి పెళ్లయ్యింది ఒక బిగ్ బేబీ ఉంది..మరి మీరు" అనేసరికి "వాళ్ళు పెళ్ళిలై కాపురాలు చేస్తుంటే వీళ్ళు పెళ్లి కాకుండా కాపురం చేస్తున్నారు" అంటూ వాళ్లకు బదులుగా అవినాష్ ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత భార్యలను ఎత్తుకుని మ్యూజికల్ చెయిర్స్ గేమ్ ని ఆడించింది శ్రీముఖి. ఇక ఇందులో నిరుపమ్ పరిటాల జోడి గెలిచింది. దానికి శ్రీముఖి కౌంటర్ వేసింది "ఊరికే అనలేదు డాక్టర్ బాబు అని ఈ వయసులోనే ఇలా ఉంటే ఆ వయసులో" అనేసరికి నిరుపమ్ నవ్వేసాడు. లాస్ట్ లో భార్యలకు భర్తలు జడలు వేసే టాస్క్ ఇచ్చింది. "మీ లైఫ్ లో ఎప్పుడైనా జడేశారా..? ఇదే ఫస్ట్ టైమా ?..జడ వేయడం ఫస్ట్ టైమా, మీ ఆవిడకి వేయడం ఫస్ట్ టైమా " అని అవినాష్ నిరుపమ్ ని అడిగేసరికి "జడ వేయడం ఫస్ట్ టైం" అని సీరియస్ గా ఆన్సర్ చేసాడు. ఇలా రొమాంటిక్ కపుల్స్ తో ఒక షో ఆదివారం ప్రసారం కాబోతోంది.


Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..