English | Telugu
ఈ మధ్య నువ్వు చాలా బాగుంటున్నావ్...ఆరియానాకు కాంప్లిమెంట్
Updated : Mar 4, 2023
అరియనా గ్లోరీ బిగ్‌బాస్ 4, బిగ్‌బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్‌గా సందడి చేసింది. బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ తో బీబీ కెఫె కూడా చేసింది. హౌస్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఆటతీరును వివరించడమే కాకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక వాళ్ళను ఇంటర్వ్యూ చేసి వారి ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ ని అందించే బాధ్యతను నిర్వహించింది. అరియనా బిగ్ బాస్ కి దత్త పుత్రికగా మారిపోయింది. ఇక ఈ బిగ్‌బాస్ కేఫ్ పోగ్రామ్‌కు అరియానాతో పాటు మరో హోస్ట్ గా యాంకర్ శివ కూడా చేసాడు. వీళ్ళ జర్నీని చాలా నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. కొంతకాలం వీళ్ళు ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇప్పుడు ఆరియానా బీబీ జోడిలో అవినాష్ కి జోడిగా డాన్స్ చేస్తోంది. తన డాన్స్ ప్రాక్టీస్ లో భాగంగా యాంకర్ శివ తనను చూడడానికి వచ్చాడు.
వాళ్ళ ముచ్చట్లు వీడియో తీసి ఆరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది.."మీకొక విషయం తెలుసా ఈరోజు డాన్స్ ప్రాక్టీస్ క్లాస్ కి ఒక క్రేజీ గెస్ట్ వచ్చాడు. క్రేజీ యాంకర్ శివ..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "వీడియోలో మొత్తం నిన్నే కవర్ చేసుకుంటున్నావ్ గా అనేసరికి" ఫ్రేమ్ అందంగా ఉందని" చెప్పింది అరియనా. "ఏంట్రా ఈ మధ్య చాలా అందంగా ఉంటున్నాను కదా" అని అరియనా అనేసరికి " నేనా" అంటూ నవ్వేసాడు శివ. "ఈమధ్య నువ్వు బాగుంటున్నావ్...బాగా తయారవుతున్నావ్...బాగా డాన్స్ చేస్తున్నావ్..అంతా బాగుంది..అల్ ది బెస్ట్ ఆరియానా" అని చెప్పాడు యాంకర్ శివ. బిగ్ బాస్ ఓటిటి సీజన్ 1 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు శివ.