English | Telugu
రెచ్చిపోయి రవిని స్టేజి మీద తోసేసిన సన్నీ!
Updated : Jul 25, 2022
టీవీ షోస్ లో ఈమధ్య ప్రాంక్స్ ఎక్కువగా చేస్తున్నారు. అది నిజమో తెలియడం లేదు, అబద్ధమో తెలియడం లేదు. కంటెంట్ మీద కామెడీ తక్కువగా చేస్తూ ఎవరికి వారు గొడవలు పెట్టుకుంటూ షోకి రేటింగ్ పెంచే పనిలోనే ఎక్కువగా ఉంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో ఇలాంటి ప్రాంక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు స్టార్ మా షోస్ లో కూడా ఈ టైపు ప్రాంక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్టార్ మాలో లేటెస్ట్ గా ఒక ఈవెంట్ జరిగింది. బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ని పిలిచి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోని టెలికాస్ట్ చేసింది. ఈ షోకి హోస్ట్ రవి. ఐతే బిందుకి, హమీదకి ఒక టాస్క్ ఇచ్చాడు రవి. క్యూబ్స్ అన్నీ పేర్చి ఉంటాయి. పక్కన చిట్టీలు ఉంటాయి. అందులోంచి ఒక చిట్టి తీసి డైలాగ్ చెప్పి ఒక క్యూబ్ మీద ఇంకో క్యూబ్ పెట్టి వెళ్లిపోవాలి. ఇదీ టాస్క్ ఆడే విధానం. ఐతే ఈ టాస్క్ లాస్ట్ లో దివి క్యూబ్ పెట్టింది. తర్వాత కింగ్స్ నుంచి రవికృష్ణ క్యూబ్ పెట్టాడు కానీ మొత్తం క్యూబ్స్ పడిపోయాయి. దీంతో వీజే సన్నీ రెచ్చిపోయాడు.
స్టేజి మీద హంగామా క్రియేట్ చేశాడు. రెచ్చిపోయి రవిని స్టేజి మీద తోసేశాడు. మీదకు రావొద్దు అంటూ రవి కూడా సన్నీకి వార్నింగ్ ఇచ్చేశాడు. ఇలా రెండు మూడు సార్లు తోసేసుకున్నాక స్టేజి మీద ఉన్న కంటెస్టెంట్స్ అంతా వచ్చి ఇద్దరినీ విడదీశారు. నువ్ బిగ్ బాస్ లో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా క్వీన్స్ వైపే ఉన్నావ్ అంటూ మండిపడ్డాడు సన్నీ. ఎప్పుడు వన్ సైడ్ మాత్రమే ఆడతావ్ అంటూ ఆరోపణలు చేశాడు.
ఇంతలో రోల్ రైడా, అవినాష్ వచ్చి.. ఇది గేమ్ మాత్రమే. సరదాగా ఆడుకోవడానికే కానీ, గొడవలు పడడానికి కాదు అంటూ ఇద్దరినీ విడదీశారు. ఇంతలో రవి మాట మార్చేసి ఎం జరగనట్టే బిల్డప్ ఇచ్చి అరే బావా బావా అంటావ్ కదరా అంటూ సన్నీతో కలిసి స్టెప్పులేశాడు. ఇద్దరూ ఇలా అందరి చెవుల్లో పువ్వులు పెట్టారు.