English | Telugu

జీ బోనాల జాతరలో దుల్కర్ సల్మాన్

జీ తెలుగు ఎప్పుడూ కొత్త కొత్త షోస్ తో అలరిస్తూ ఉంటుంది. బోనాల్ సెలెబ్రేషన్స్ సందర్భంగా ఇప్పుడు"జీ తెలుగు వారి జాతర..అందరూ ఆహ్వానితులే" అంటూ ఈ నెల 31 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోయే ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసింది. వీకెండ్స్ లో ఆడియన్స్ ని ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సిస్టమాటిక్ గా కొత్త కొత్త కంటెంట్ తో సరికొత్తగా షోస్ ని రిలీజ్ చేస్తోంది. స్టార్ మాతో పోటాపోటీగా మంచి షోస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ఇక రాబోయే బోనాల్ జాతర స్పెషల్ షోలో చాలా మంది బుల్లితెర నటీ నటులు సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో క్రేజీ కపుల్స్ తో డాన్సులు చేయించారు. రఘుకుంచె, మధు ప్రియా, ఇంకొంతమంది వచ్చి పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు. మామూలు జాతర కాదు మాస్ జాతర అంటుంది హోస్ట్ శ్రీముఖి. ఇక వీళ్ళతో కలిసి మొలీవుడ్ ప్రిన్స్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వచ్చి అద్దిరిపోయే డాన్స్ చేసి స్టేజిని దడదడలాడించారు. సీతారామం లో నటించిన వీళ్ళిద్దరూ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటు బోనాల జాతరలో, అటు క్యాష్ లో కూడా సందడి చేయనున్నారు . నారి నారి నడుమ మురారి టైపులో దుల్కర్ ఇటు శ్రీముఖితో అటు మృణాల్ తో కలిసి స్టెప్పులేసి ఇది కదా జాతరంటే అనిపించేలా చేసాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.