English | Telugu
తన అమెరికా ట్రిప్ ని ఒక్క నిమిషంలో చూపించిన యాంకర్ రవి!
Updated : Jul 20, 2023
బుల్లితెర టీవీ యాంకర్స్ లో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పంచ్ లకి, మాటలకీ ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అతను చేసే పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి.
యాంకర్ రవి ఎక్కడికి వెళ్ళిన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తుంటాడు. అందులో మొన్న శ్రీలంకకి సముద్రం మీదుగా వెళ్ళాడు. దాని గురించి వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. అయితే తాజాగా తన అమెరికాకి ఒక షూట్ నిమిత్తం వెళ్ళాడు. అయితే వెళ్ళేముందు తను ఎయిర్ పోర్ట్ లో ఒక లుంగీ లా ఉండే డ్రెస్ ని ధరించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దానికి నెగెటివ్ కామెంట్స్ రావడంతో వాటికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు రవి.
అమెరికాకి వెళ్ళి వస్తున్నట్టుగా ఒక వీడియోని చేశాడు రవి. ఏదో మిస్ అయినట్లు తన చేతిని అలా ఇంటివరకు తీసుకొచ్చి తన భార్యని పట్టుకొని హగ్ చేసుకున్నాడు. ఇదంతా వీడియోలా చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు రవి. కాగా ఈ పోస్ట్ కి వదినని మిస్ అవుతున్నట్టుగా కవర్ చేయడానికే కదా అన్న ఈ వీడియో అని ఒకరు కామెంట్ చేయగా అది వైరల్ అయింది. అయితే ఇప్పుడు పదిహేను రోజుల పాటు అమెరికాకి వెళ్ళి వచ్చిన ఫోటోలన్నీ కలిపి.. " My 15 Days U.S trip in 1.30mints " అనే టైటిల్ తో పోస్ట్ చేశాడు. కాగా ఈ ట్రిప్ లో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్ చెప్పాడు. అక్కడ అమెరికాలో దిగిన ఫోటోలన్నీ కలిపి షార్ట్ వీడియోగా చేశాడు రవి. దీంతో ఇప్పుడు రవి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.