English | Telugu
శ్రీముఖి పెళ్లయ్యాకే మానస్ పెళ్లి.. సిరిసిరిమువ్వ ఏం పాపం చేసింది
Updated : Jul 20, 2023
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్" లేటెస్ట్ ప్రోమోకి సీరియల్ యాక్టర్స్ వచ్చేసారు. ఓల్డ్ ఈజ్ "గోల్డ్ అనే థీమ్" తో ఈ షో ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. కోయిలమ్మ సీరియల్ నుంచి మానస్ - తేజస్విని గౌడ, అగ్నిసాక్షి నుంచి అంబటి అర్జున్- ఐశ్వర్య, మౌనరాగం నుంచి శివ్-ప్రియాంక, మనసిచ్చి చూడు నుంచి మహేష్-కీర్తి భట్, లక్ష్మి కళ్యాణం నుంచి ప్రియతమ్-హర్షిత, గోరింటాకు నుంచి నిఖిల్- కావ్య సీరియల్స్ లో హీరోహీరోయిన్స్ వచ్చారు. ఈ సీరియల్స్ అన్ని కూడా సక్సెస్ ఫుల్ రేటింగ్ తో పూర్తైపోయిన సీరియల్స్.
అగ్ని సాక్షి సీరియల్ లో నటించిన అంబటి అర్జున్- ఐశ్వర్యని పిలిచింది శ్రీముఖి..ఆ సీరియల్ లో వాళ్ళ పేర్లు గౌరీ-శంకర్.."గౌరీ నువ్వు శంకర్ ని మిస్ అవుతున్నావా" అని శ్రీముఖి అడిగింది. "చాలాచాలా మిస్ అయ్యాను" అని చెప్పేసరికి "ఈ మాట మీ ఆయన గనక విన్నాడనుకో" అన్నాడు శంకర్. కోయిలమ్మ సీరియల్ నుంచి మానస్ - తేజస్విని గౌడను పిలిచింది శ్రీముఖి. సీరియల్ లో వీళ్ళ పేర్లు అమర్- చిన్ని.."కానీ మా అమర్ కి మాత్రం ఇంకా పెళ్ళవలేదు" అని శ్రీముఖి అనేసరికి "నీకు పెళ్లయ్యాక నాకు పెళ్లవుతుంది" అని చెప్పాడు. "సీరియల్ లో అమర్ రియల్ లైఫ్ లో కూడా అమర్" అలా ఎలా కుదిరింది అని తేజుని అడిగేసరికి ఏమో తెలీదు అని చెప్పింది. "ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు..అప్పుడు ఓల్డ్ లో గోల్డ్ గా బతికిన నన్ను వదిలేశారు..మా సిరిసిరిమువ్వ సీరియల్ ఏం పాపం చేసింది" అని అమరదీప్ చౌదరి అడిగేసరికి "మీ మువ్వ రాలేదు" అని అంది శ్రీముఖి. తర్వాత వీళ్లందరితో గేమ్స్ ఆడించింది. ఇక హీరోయిన్స్ కి హీరోస్ అంత చేతులకు గోరింటాకు పెట్టారు.