English | Telugu
ఆడపిల్లకు జన్మనిచ్చిన యాంకర్ అశ్విని శర్మ
Updated : May 2, 2023
యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మూవీ ఈవెంట్స్ కి ఈమె హోస్ట్ గా వ్యవహరించింది. ఎంతోమంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ కూడా చేసింది. ఈమె ప్రతీక్ అనే అతన్ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలేసి భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. ఛత్రపతి మూవీలో శ్రియకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది అశ్విని. ఇదే కాకుండా ఇంకా ఎన్నో మూవీస్ లో నటించింది. కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యంతో పాటు నీకోసం, ఖుషి, మలబార్ గోల్డ్ ఆనందం, జస్ట్ ఫర్ ఫన్, మా టాకీస్, వారెవ్వా క్యా బాత్ హే.. లాంటి ఎన్నో టీవీ షోస్ లో కూడా చేసింది. ఐతే ఫిబ్రవరిలో తన భర్తతో కలిసి ఇన్స్టాగ్రామ్ లో తన బేబీ బంప్ ఫొటోస్ ని అప్ లోడ్ చేసింది.
ఇక ఇప్పుడు ఏప్రిల్ 20 న తనకు కూతురు పుట్టింది అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. " మాకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఆ సాయిబాబా ఆశీర్వాదంతో ఆ దేవతే మా ఇంటికి వచ్చినట్టు ఉంది. మా జీవితంలో మాతో చేరిన ఈ చిన్నారి దేవదూతను మనసారా ఆహ్వానిస్తున్నాం" అని కాప్షన్ పెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్న ఇంటరెస్ట్ తో లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో టెక్స్ టైల్స్ కోర్స్ చేసి అశ్విని ఆ తర్వాత ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ ఐన ప్రతీక్ ని పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్లిపోయింది. ఇప్పుడు అశ్విని చెప్పిన గుడ్ న్యూస్ కి ఆమెతో పరిచయం ఉన్న యాంకర్స్, సెలబ్రిటీస్ తో పాటు ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను విష్ చేస్తున్నారు. జ్యోతక్క అలియాస్ శివజ్యోతి కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ పుట్టింది.