English | Telugu

తిండిలేక ఇబ్బంది పడ్డా.. 75 రూపాయ‌లు ఇస్తే గొప్ప‌గా ఫీల‌య్యా!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా రాదు. టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈరోజు ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడినవారే. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా తన కెరీర్‌లో పడిన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. శేఖర్ మాస్టర్ ఒకప్పుడు కొరియోగ్రాఫర్ గానే పని చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన బుల్లితెరపై ఓ స్టార్‌గా ఎదిగారు. పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోల సినిమా అంటే కచ్చితంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే.

చిరంజీవి, రామ్ చరణ్ లాంటి వాళ్లు శేఖర్ మాస్టర్‌ని ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. సినిమాలతో పాటు బుల్లితెరని కూడా బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొన్నిరోజులుగా శేఖర్ మాస్టర్ 'ఢీ' షో నుండి జడ్జిగా తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన 'ఢీ' షోలో కనిపించడం లేదు. సినిమాలతో బిజీగా ఉండడం వలన ఆయన షోకి రాలేకపోయారని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలో ఆయన 'కామెడీ స్టార్స్' అనే షోలో జడ్జిగా కనిపించారు. దీంతో ఆయన కావాలనే 'ఢీ' షోని వదిలేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం శేఖర్ మాస్టర్ 'కామెడీ స్టార్స్' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకి వచ్చింది. అందులో అవినాష్ టీమ్ ఓ స్కిట్ చేసింది. ఆ స్కిట్ చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు.. తిండి సరిగ్గా దొరికేది కాదని.. 75 రూపాయలు ఇస్తే ఎంతో గొప్పగా ఫీలయ్యాయని.. అన్నం కూడా దొరకని స్థితిలో ఉండేవాడ్ని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎమోషనల్ అవ్వడంతో స్టేజ్ మీద ఉన్న వారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రోమోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.