English | Telugu

అన్నా ప్రమోషన్స్ గట్టిగా చెయ్యి..ఇమ్మూకి ఆనంద్ దేవరకొండ సలహా

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ కి మంచి లైఫ్ ఇచ్చింది. అలాంటి కమెడియన్లలో ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. ఇమ్ము - వర్ష జోడి కలిసి తమదైన మార్క్ పంచులతో ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా టాలెంట్ తో పైకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కమెడియన్ ఇటీవలే "ప్రేమ వాలంటీర్" అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

ఇది పూర్తయ్యిందో లేదో మరో మూవీ కూడా చేసేసాడు. అదే "గంగం గణేష్" పేరుతో రిలీజ్ కాబోతోంది. ఇక ఇమ్ము ఆ మూవీకి డబ్బింగ్ ఇప్పుడే పూర్తయ్యిందంటూ.. మంచి ఫన్ కోసం కొన్ని డేస్ వెయిట్ చేయండి అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అలాగే ఆనంద్ దేవరకొండని టాగ్ చేసి మామా ఇచ్చి పడేస్తున్నాం అని అలాగే డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టిని టాగ్ చేసి అన్నా థ్యాంక్యూ సో మచ్ అంటూ కామెంట్స్ పెట్టాడు. ఇక ఈ పిక్ ని చూసేసరికి ఆనంద్ దేవరకొండ రెస్పాండ్ అయ్యాడు .."నీ మూవీ కోసం వెయిటింగ్, ప్రమోషన్స్ గట్టిగా చెయ్యన్నా" అంటూ కామెంట్ చేసాడు.

ఇక మరో జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా రిప్లై ఇచ్చాడు "ఆల్ ది బెస్ట్ రా కంగ్రాట్యులేషన్స్" అన్నాడు. క్రైమ్ అండ్ యాక్షన్ సీన్స్ తో రూపొందుతున్న ఈ మూవీని త్వరలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఈ మూవీలో ఆయన పక్కన ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మిగతా క్రూ విషయానికి వస్తే కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ కీ రోల్ పోషించారు. ఇక ఇందులో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ వెళ్లిన ప్రిన్స్ యావర్ కూడా కీ రోల్ పోషించాడు.