English | Telugu

పట్నం వచ్చిన పతివ్రత గెటప్ ఏంటి..

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి జానకిరామయ్య గారి మనవరాలు వెర్సెస్ పడమటి సంధ్యారాగం సీరియల్స్ పోటీ పడుతున్నాయి. ఇక ఇందులో జ్యోతక్క కూడా వచ్చింది. అప్పుడు ఒక సీరియల్ యాక్టర్ ని పిలిచిన హోస్ట్ అంబటి అర్జున్ "పక్కా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు చెప్పు" అనేసరికి అతను శివజ్యోతి గారు అన్నాడు. "పక్కా ఊరోళ్ళే అంటారు" అన్నాడు అర్జున్. "డౌటా" అని కసిరింది జ్యోతక్క. "మరి ఇదేంటండి" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వెస్ట్రన్ స్టైల్ లో రెడీ అయ్యి ఫొటోస్ దిగిన జ్యోతక్క పిక్స్ వేసి చూపించాడు. దాంతో జ్యోతక్క షాకయ్యింది. "మరి పట్నం వచ్చిన పతివ్రత గెటప్ ఏటి" అని అడిగాడు. అష్షు రెడ్డి ఆ పిక్స్ చూసి అమ్మబాబోయ్ అనుకుంది.

ఆ తర్వాత ఆ పిక్స్ చూసి ఆమె కూడా నవ్వుకుంది. ఆ తరువాత "మా టీమ్ తో పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొటెల్ని కట్టేసినట్టే" అంది శివజ్యోతి. తర్వాత ఈ రెండు సీరియల్స్ వాళ్లకు టాస్కులు ఇచ్చారు. ముంజల్ని ఇచ్చి కాయలు కొట్టుకుని వాళ్ళే అన్నీ ఫినిష్ చేసేటట్టు. తర్వాత బిందెలతో బాల్స్ తెచ్చి ఒక బాక్స్ లో వేయడం ఇలా. ఐతే రెండు గ్రూప్స్ రూల్స్ ని అతిక్రమించాయి అంటూ అర్జున్ చెప్పాడు. దాన్ని కూడా చూపించాడు. ఇక సీరియల్ నటులైతే ఇవన్నీ తెలిసినప్పుడు ముందే ఆపేయాలి ఇప్పుడు చెప్పడం ఏమిటి అంటూ అడిగారు. బాల్స్ లైన్స్ టచ్ చేసారు అంటూ రెండు సీరియల్స్ వాళ్ళు అరుచుకుంటుండేసరికి అంబటి అర్జున్ కూడా ఇంకా గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అందరూ షాకైపోయారు. ఆ తర్వాత ఈ గేమ్ డ్రా అయ్యిందని చెప్పేసరికి జానకిరామయ్య గారి మనవరాలు టీమ్ వాళ్ళు షో నుంచి వాకౌట్ చేస్తాం అంటూ బెదిరిస్తూ మైక్ కూడా కింద పారేసి వెళ్లిపోయారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.