English | Telugu

హుక్ స్టెప్ ఆయనతోనే స్టార్ట్ అయ్యింది...అల్లు అర్జున్ సర్ బ్రేక్ ఇచ్చారు...

శేఖర్ మాష్టర్ అంటే టాలీవుడ్ లో తెలియని వాళ్ళు లేరు. ఈయన ఎన్నో సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. అవి సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యాయి. శేఖర్ మాష్టర్ సాంగ్ అంటే అందులో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఆయనకు ఎన్ని మంచి కామెంట్స్ వచ్చాయో అన్నే నెగటివ్ ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అలాగే తన లైఫ్ లో బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఎదో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఇండస్ట్రీలోకి ఎంటర్ ఐన కొత్తల్లో సుధీర్ బాబు నటించిన ఎస్.ఎం.ఎస్ మూవీకి కొరియోగ్రాఫ్ చేసాను. ఆ మూవీ ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. ఐతే అప్పటికే హైదరాబాద్ వచ్చి చాలా టైం స్పెండ్ చేశా. మా ముందు బాచ్ వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి..నాకు మాత్రం బ్రేక్ దొరకడం లేదు. ఎంత కష్టపడుతున్నా ఉపయోగం ఉండడం లేదు వెళ్ళిపోదాం అనుకున్న టైములో బన్నీ గారు ఫోన్ చేశారు. నేను సాంగ్ ఇస్తాను నాకు మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి నచ్చితే ఓకే చేస్తాం అన్నారు.

నాకు అదే మహాప్రసాదం అనుకుని వెళ్లాను ఆ సాంగ్ ఓకే అయ్యింది. అదే జులాయి మూవీలో సాంగ్ "లాయి లాయి ..మేహూ జులాయి" సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేసాను. అదే టైములో తారక్ సర్ ది బాద్షా మూవీ ఆఫర్ కూడా వచ్చింది. అది "సైరో" సాంగ్. అలా జులాయి సాంగ్ తో బ్రేక్ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఏ పాట చేసినా రెండు, మూడు ఒప్షన్స్ ని నా హీరోస్ కి డైరెక్టర్స్ కి చూపిస్తాను. వాళ్ళ బాడీ మ్యానరిజానికి తగ్గట్టు చేస్తాను. అందరూ ఓకే అంటేనే చేస్తాను. కొంతమంది మాత్రం నెగటివ్ గా కావాలనే ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను ఏ సాంగ్ చేసినా హుక్ స్టెప్, సిగ్నేచర్ స్టెప్ ఉండాలని అనుకుంటా. ప్రతీ సాంగ్ లో క్యాచీగా ఉండే ఒక హుక్ స్టెప్ అందరూ ఈజీగా చేసేదిగా ఒకటి కంపోజ్ చేస్తాను. లక్కీగా అందరూ అది ఫాలో అవుతూ ఉంటారు. సాంగ్ కి ఎం కావాలి, హీరో హీరోయిన్ బాడీ ఏ సాంగ్ కి సెట్ అవుతుందో చూసుకుని అది కంపోజ్ చేస్తాను. ఒక్కో సారి అప్పటికప్పుడు కూడా సాంగ్స్ కంపోజ్ చేయాల్సి వస్తుంది. అలా చేసిన సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి." అని చెప్పారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.