English | Telugu

Brahmamudi : భార్యకి సర్ ప్రైజ్ ఇచ్చిన భర్త.. రాజ్ ని సుభాష్ చూస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -706 లో..... రాజ్ తన తెలివితో కావ్య అడ్రెస్ కనుక్కున్నానని కావ్యకి ఫోన్ చేసి చెప్తాడు. కానీ రాజ్ కనుక్కుంది ఏదో అడ్రెస్.. అది విని కావ్య నవ్వుకుంటుంది. నేను మీ ఇంటికి వచ్చి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నానని రాజ్ అనగానే పాపం ఆయన వెళ్లే ఇంట్లో కుక్కలు అయితే ఉండకూడదని కావ్య అనుకుంటుంది.

ఆ తర్వాత యామిని పేరెంట్స్ యామినితో పెళ్లి గురించి డిస్కషన్ చేస్తారు. నాకు రాజ్ తో పెళ్లి అయితే చాలు.. ఎలా అనేది నాకు అవసరం లేదు కానీ మీ హ్యాపీ నెస్ కోసం మీరు నచ్చినట్టు చేయండి అని యామిని అంటుంది. రాజ్ మనసు లో ఏముందోనని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఇంకొకసారి రాజ్ అనకు రామ్ అను అని యామిని కోప్పడుతుంది. వాళ్ళ అమ్మని రాజ్ కలుస్తున్నాడు.. రాజ్ చుట్టూ కావ్య తిరుగుతుందని యామిని వాళ్ళ నాన్న అంటాడు.

మరోవైపు కావ్యకి సర్ ప్రైజ్ ఇవ్వాలని తను కనిపెట్టిన అడ్రెస్ కి రాజ్ బయలుదేర్తాడు. ఆ తర్వాత అపర్ణ ఇంట్లో అందరిని పిలిచి క్యారమ్స్ ఆడుతుంది. ఏంటి ఈవిడకి రోజురోజుకి పిచ్చి లేచినట్లు చేస్తుందని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. రాహుల్ రుద్రాణి అక్కడినుండి వెళ్లిపోతుంటే.. రండి అని అపర్ణ పిలుస్తుంది. ఆ తర్వాత కావ్య క్యారమ్స్ ఆడేవాళ్లందరికి జ్యూస్ తీసుకొని వస్తుంది. రాజ్ అనుకోకుండా ఏదో గుర్తువచ్చినట్లు వాళ్ళ ఇంటిముందే ఆగి. నేను ఇక్కడ ఆగానేంటి ఇదేనా ఆ కళావతి ఇల్లు అని రాజ్ అనుకొని లోపలికి వస్తుంటే.. రాజ్ ని చూసి కావ్య షాక్ అవుతుంది. అపర్ణకి కావ్య చెప్తుంది. దాంతో ధాన్యలక్ష్మి, ఇందిరాదేవిలని లోపలికి తీసుకొని వెళ్తుంది అపర్ణ. రాహుల్, రుద్రాణి ని అప్పు లోపలికి తీసుకొని వెళ్లి డైవర్ట్ చేస్తుంది. రాజ్ లోపలికి వచ్చి కావ్యతో మాట్లాడతాడు.

తరువాయి భాగంలో కావ్యకి రాజ్ సర్ ప్రైజ్ కి చీర తీసుకొని వస్తాడు. కాసేపటికి ఎవరు చూడకుముందు రాజ్ ని పంపిస్తుంది కావ్య. అప్పుడే రాజ్ కి సుభాష్ ఎదరుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.