English | Telugu
షన్ను, దీప్తి ఇలా.. సిరి, శ్రీహాన్ అలా..
Updated : Jan 4, 2022
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జెస్సీ హెల్త్ కారణాల వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడంతో సిరి, షన్నుల ఎపిసోడ్ పరాకాష్టకు చేరింది. ఊ అంటే హగ్గులు.. ఆ అంటే హగ్గులు.. ముద్దులు.. ఒక దశలో వీరి హగ్గులు చూడలేక జనాలకే వెగటు పుట్టేసింది. అంతలా వీరి హగ్గుల పురాణం నడిచింది. అయితే అదే ఇప్పుడు షన్ను పాలిట విలన్ గా మారి తన నుంచి దీప్తి విడిపోయేలా చేసింది. ఇటీవల దీప్తి తను షన్నుతో విడిపోతున్నట్టు ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే.
Also read:వంటలక్క మరిదిని బుట్టలో వేసిన మోనిత
తాజాగా లైవ్ లో కొచ్చిన దీప్తి తనని షన్ను గురించి అడిగే సరికి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక లైవ్ లో నుంచి ఏడుస్తూనే వెళ్లిపోయింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన వారంతా సిరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సిరి హౌస్ లో తనని తాను కాపాడుకోవడం కోసమే షన్నుతో హగ్గుల డ్రామా ఆడిందని, ఇప్పడు అదే షన్ను, దీప్తిల బ్రేకప్ కు కారణంగా మారిందని మండిపడుతున్నారు.
Also read:సిరి, షణ్ణు తెలిసే చేశారు.. మానస్ బయటపెట్టేశాడు!
ఈ కామెంట్ ల నేపథ్యంలో సిరికి ఆమె ప్రియుడు శ్రీహాన్ కూడా బ్రేకప్ చెప్పేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా శ్రీహాన్ మాత్రం సిరికి సపోర్ట్ గా నిలవడమే కాకుండా ఆమెకు బర్త్ డే సర్‌ప్రైజ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇన్ స్టా స్టోరీస్ లో.. సిరికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ శ్రీహాన్ ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేశాడు. ఈ ఏడాది నీకు అన్నీ శుభాలే కలగాలంటూ శుభాకాంక్షలు అందజేశాడు. అయితే శ్రీహాన్ పోస్ట్ పై సిరి ఏమాత్రం స్పందించకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక వైపు షన్ను, దీప్తి బ్రేకప్ తో విడిపోతే సిరికి శ్రీహాన్ బర్త్ డే విషెస్ చెప్పడం.. దానికి సిరి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడం పలు అనుమానాలకి తావిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.