English | Telugu

ఆ టాటూతో హరితేజ కనెక్ట్ అయ్యిందంట!

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే హరితేజగత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.

సీరియల్స్ తో మొదలైన తన కెరీర్.. టీవీ షోస్, యాంకరింగ్ అంటూ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ మొదటి సీజన్ లోనే ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అందరి మెప్పు పొందింది. వీటితో పాటుగా డాన్స్ షోలలో సైతం తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది హరితేజ. నితిన్, సమంత నటించిన 'అఆ' మూవీ లో హరితేజ చేసిన కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో పలువురి ప్రశంసలు అందుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి కాంప్లిమెంట్ తీసుకుంది.

హరితేజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో 'లాంగ్ టైం నో సీ' అంటూఅభిమానులతో ముచ్చటించింది. తన అభిమానులు ప్రశ్నలు అడుగగా వాటికి ఓపికగా సమాధానమిచ్చింది హరితేజ. "యూ ఇన్ స్పైర్ మెనీ ఆఫ్ అజ్" అని ఒకరు చెప్పగా.. చీర్స్ టూ దట్, లోడ్స్ ఆఫ్ లవ్ అని రిప్లై ఇచ్చింది హరితేజ. "రీజన్ బిహైండ్ యువర్ టాటూ" అని ఒకరు అడుగగా.. ఆ టాటూతో నేను కనెక్ట్ అయ్యాను. అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ నాలో ఉండాలని, ఉంటాయని అలా టాటూ వేపించుకున్నానని చెప్పింది హరితేజ.

మీరు డెలివరీ తర్వాత వెయిట్ లాస్ అయ్యారు కదా ఆ జర్నీ వీడియో చేయండని ఒకరు అడుగగా.. లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి వెయిట్ లాస్ గురించి.. త్వరలోనే చేస్తానని హరితేజ చెప్పింది. మీరు సునీత గారు కలిసి చేసిన మదన మోహన సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒకరు అడుగగా.. నేను కూడా వెయిటింగ్. వచ్చాక షేర్ చేస్తానని హరితేజ చెప్పింది. ఇలా కాసేపు తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చటించింది హరితేజ.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.