English | Telugu
రాంచరణ్ నా హార్ట్ బీట్..పూజ హెగ్డేతో డేటింగ్
Updated : May 2, 2023
సుమ ఏ షోలో చేస్తే ఆ షోలో ఫుల్ కామెడీ..ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని మరోసారి నిరూపించింది. "సుమ అడ్డా" షో ఈ వారం కూడా చక్కగా నవ్వించడానికి మన ముందుకు రాబోతోంది. దానికి సంబందించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి నెక్స్ట్ వీక్ ఏజెంట్ మూవీ నుంచి అఖిల్ అక్కినేని, సాక్షివైద్య వచ్చారు. "సిసింద్రీ మూవీ నుంచి వెయిట్ చేస్తున్నా అఖిల్ ఎప్పుడెప్పుడు మన షోకి వస్తాడా" అని కామెడీ చేసింది సుమ.
తర్వాత సుమకి రెడ్ రోజ్ ఇచ్చాడు అఖిల్. స్టేజి మీద పడేసి ఉన్న సైకిల్ నుంచి చైన్ లాగి దాన్ని సుమ మేడలో వేసాడు ఏజెంట్. దాంతో సుమ షాకయ్యింది. "మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు..వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా " అని అడిగేసరికి "ఇంకెవరు రాంచరణ్..నా హార్ట్ బీట్" అని చెప్పాడు. "డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోయిన్ తో వెళ్తారు" అని అడగడంతో "పూజాహెగ్డే" అని చెప్పాడు. "మీరు చేసిన పనుల్లో నాగార్జున గారికి ఇప్పటికీ తెలియని పని ఏమిటి" అనేసరికి "రాత్రిపూట గోడ దూకేసి బయటికి వెళ్లిపోయేవాడిని" అని చెప్పాడు. "నాగార్జున గారు చూసారా మీరు 25 అడుగుల గోడ కట్టించారు..ఐనా ఎం లాభం..మీ అబ్బాయి గోడ దూకేసాడు" అని కంప్లైంట్ చేసింది సుమ. ఇక మహేష్ బాబు చెప్పిన "ఎవరు కొడితే" అనే డైలాగ్ ని ఆ స్టయిల్లో చెప్పాడు. ఇంతలో ఒక స్టూడెంట్ లేచి "నాకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఒకరికి ప్రొపోజ్ చేయాలి " అని చెప్పేసరికి "నీకు అడ్వైస్ ఇస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు..నేను నీకు సలహా ఇవ్వను" అని తపించుకున్నాడు అఖిల్.