English | Telugu

జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నా...ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ప్రతీ వారం లాగే ఈ వారం షో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఎంటర్టైన్ విషయం పక్కన పెడితే ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా తెలిసింది. ఈ వారం షోకి యాంకర్ రవి-విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ ఓంకార్ వీళ్ళతో ఎన్నో టాస్క్స్ ఆడించాడు. విష్ణుప్రియ బైక్ కూడా గెలుచుకుంది. ఇక ఎగ్స్ పగలగొట్టేటప్పుడు ఒక విషయం అడిగాడు. "ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా" అని అడిగేసరికి "రీసెంట్ గా ప్రేమలో పడ్డాను. ఆయన వయసు నాకు సరిపోకపోవచ్చు అని మీరు అనుకుంటారు. ఆయనే జేడి. చక్రవర్తి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళిపోతాను" అంది విష్ణుప్రియ.

"ఎందుకు నీకు ఆయనంటే ఇష్టం" అని యాంకర్ ఓంకార్ అడిగేసరికి "ఒక వెబ్ సిరీస్ కోసం 40 డేస్ మంగళూరులో ఆయనతో జర్నీ చేసాను. ఆ జర్నీలో పదో రోజు నేను ఫుల్ ఫ్లాట్ ఐపోయాను." అని చెప్పింది. "ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్" అని ఓంకార్ అడిగాడు. "చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అలా వాల్కనోలా పేలి 2022 నవంబర్ 25 వ తేదీ రాత్రి నాకు అర్ధమయ్యింది. నేను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నాను" అనే విషయం తెలిసింది అని చెప్పింది. "ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా" అని అడిగేసరికి "నేనైతే ఆయనకు చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు."అని చెప్పింది. "రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నావా" అని రవి అడిగేసరికి " ఐ హోప్ సో..నా మనసులో ఏముందో ఆయనకు చెప్పేసాను. ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేసాయి. తెల్ల జుట్టు కూడా వచ్చేస్తోంది. టైం వేస్ట్ చేయడం ఇష్టంలేక చెప్పేసాను" అంది. విష్ణుప్రియ ‘పోవే పోరా’ షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది.

తర్వాత టీవీ షోలు, ఈవెంట్లలో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’, ‘చెక్ మేట్’ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే మూవీస్ లో నటించింది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆల్బమ్‌ సాంగ్స్‌తో బిజీగా ఉంటోంది. యాక్టర్ మానస్, ప్రియతో కలిసి "గంగులు" అనే సాంగ్ లో నటించింది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి "జరీ జరీ పంచెకట్టి" అంటూ చేసిన సాంగ్‌ కూడా బాగా హిట్‌ అయ్యింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.