English | Telugu

రిషికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన స్టూడెంట్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -751 లో.. ధరణి బయట పడుకోవడానికి దిండు దుప్పట్లు తీసుకుపోతుంటే.. జగతి, వసుధారలు చూస్తారు. వసుధార ధరణిని ఏంటని అడగబోతుంటే.. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని‌ జగతి తనని ఆపుతుంది. మరుసటి రోజు ఉదయం రిషి కాలేజీకి బయల్దేరుతుంటాడు. ఏ సూట్ వేసుకోవాలోనని రిషి కన్ఫ్యూజన్ లో ఉంటాడు. రిషికి వసుధార సూట్ సెలక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మన ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి వసుధార అని రిషి అంటాడు. మీపై నాకు ఎప్పుడు ప్రేమనే ఉంటుందని వసుధార అంటుంది.

ఆ తర్వాత కాలేజీకి ఇద్దరు బయలుదేరుతుంటే.. వాళ్ళు అన్యోన్యంగా ఉండటం చూడలేని దేవయాని.. వాళ్ళు అలా హ్యాపీగా ఉంటే నాకు నచ్చడం లేదని శైలేంద్రతో అంటుంది. మన అయిష్టాలు అసహనాలు ఇలా చెప్పకూడదని శైలేంద్ర అంటాడు. రిషి, వసుధారలతో పాటు శైలేంద్ర కూడా కాలేజీకి బయల్దేరుతాడు. కార్ దగ్గరికి వెళ్ళగానే.. అన్నయ్య మీరు ముందు కూర్చోండని రిషి అనగానే.. లేదు రిషి.. వసుధార నువ్వు పక్కపక్కన కూర్చోండి.. మిమ్మల్ని నేను విడదియ్యలేనని శైలేంద్ర అంటాడు. ఇక కాలేజీకి వెళ్తుంటే.. రిషి మాత్రం శైలేంద్ర గురించి గొప్పగా చెపుతాడు. కాలేజీకి వెళ్ళగానే కొందరు స్టూడెంట్స్ బొకేతో రిషి దగ్గరికి వస్తారు. ఏంటి స్పెషల్ అని రిషి అడుగగానే.. సర్ ప్రైజ్ అని స్టూడెంట్స్ అంటారు. కాలేజీలో రిషికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి శైలేంద్ర కుళ్ళుకుంటాడు. రిషి, శైలేంద్రలు అలా కలిసిరావడం చూసిన ఫణింద్ర, మహేంద్ర లు సంతోషపడుతారు. జగతి మాత్రం.. దేవయాని అక్కలాగా శైలేంద్ర ఉన్నాడు.. మీలా మంచివారు కాదని మనసులో అనుకుంటుంది. రిషి కాలేజీలో శైలేంద్రని పరిచయం చేస్తాడు. స్టూడెంట్స్ మాత్రం ఎవరయినా మాకు అవసరం లేదు.. మీరే మాకు ఇంపార్టెంట్ అన్నట్లు స్టూడెంట్స్ మాటలు ఉండడంతో.. శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. ఇక కాలేజీకి సంబంధించిన లోగోని స్టూడెంట్స్ తయారు చేస్తారు.. అది రిషికి చూపిస్తారు. వసుధార, జగతిల సహాయం తో చేశామని స్టూడెంట్స్ చెప్పగానే.. రిషి ఆశ్చర్యపోతాడు. ఈ లోగోని మీరే ఆవిష్కరించండని స్టూడెంట్స్ అనగానే.. శైలేంద్ర తన మనసులో.. ఇంకెవరు నన్నే ఆవిష్కరించారమంటారని అనుకుంటాడు. కానీ రిషి మాత్రం ఈ లోగో ఆవిష్కరణ జగతి, వసుధారలు చెయ్యాలని అంటాడు.

ఆ తర్వాత శైలేంద్ర తన మనసులో కన్నింగ్ గా ఆలోచిస్తుంటాడు. ఎలాగైనా కాలేజీ ఎండీ స్థానంలో శైలేంద్ర కూర్చోవాలని చూస్తుంటాడు. మరి దేవయాని కుట్ర ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.