English | Telugu
విషం తాగేసిన రత్తమ్మ
Updated : Jun 7, 2022
మసాలా కంపెనీలో పని చేసే రత్తమ్మ మీద ఐశ్వర్య కోపం పెంచుకుని ఎలాగైనా తనను ఉద్యోగంలోంచి తీసేయాలని ప్లాన్ చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి కొంత స్టాక్ ని రత్తమ్మ ఇంట్లో ఎవరికీ తెలియకుండా పెట్టించి గోడౌన్ లో స్టాక్ తగ్గిందంటూ పోలీసులకు ఫోన్ చేస్తుంది ఐశ్వర్య. వాళ్ళు వచ్చి ఇల్లంతా గాలించి స్టాక్ ని పట్టుకుని రత్తమ్మని ప్రశ్నిస్తారు. నువ్వు దొంగతనం చేసావ్ కాబట్టి స్టాక్ నీ ఇంట్లో ఉంది అంటూ పోలిసుల ముందే రత్తమ్మను అవమానిస్తుంది ఐశ్వర్య. ఆ సంఘటన తర్వాత పరువు పోయిందన్న రత్తమ్మ గదిలోకి వెళ్లి తాళం పెట్టుకుని విషం తాగేస్తుంది. అంతలో శ్యామా వాళ్ళు రత్తమ్మ ఇంటికి వస్తారు.
రత్తమ్మ ఇంటి తలుపులు బద్దలు కొట్టడాన్ని చూసి ఏం జరిగిందని అడుగుతుంది శ్యామా. ఐశ్వర్య చేసిన పని గురుంచి అక్కడి వాళ్ళు చెప్తారు. వెంటనే శ్యామా వాళ్ళు రత్తమ్మను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మరో పక్క ఐశ్వర్య తాను చేసిన మంచి పని గురుంచి అత్తగారితో చెప్తుంటే శ్యామా అసలు విషయం మామగారితో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. సాక్ష్యాలతో సహా శ్యామా రత్తమ్మ తప్పు చేయలేదని నిరూపిస్తుందా ? ఐశ్వర్య ప్లాన్ ని బయట పెడుతుందా ?. ఈ విషయాలు తెలియాలంటే జీ తెలుగు లో మధ్యాహ్నం ప్రసారమయ్యే కృష్ణ తులసి సీరియల్ లో చూడొచ్చు.