English | Telugu

ఆదిరెడ్డికి సీక్రెట్ టాస్క్..సక్సెస్ అవుతాడా?


బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ని రెట్టింపు చేసేది 'సీక్రెట్ టాస్క్'. ఎందుకంటే ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ సపోర్ట్ లేకుండా సోలో గా తమ సత్తాను చూపించే అవకాశం. అలాంటిది ఇప్పుడు ఈ సీక్రెట్ టాస్క్ ఆదిరెడ్డిని వరించింది.

'మిషన్ ఇంపాజిబుల్' టాస్క్ లో అందరు బాగా పర్ఫామెన్స్ చేస్తున్నారు. అయితే గేమ్ మధ్యలో బిగ్ బాస్, ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూంకి రమ్మని పిలిచాడు. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ, " ఆదిరెడ్డి మీరు వాష్ రూంని పూర్తిగా అశుభ్రపరిచి, ఆ పనిని రెడ్ స్క్వాడ్ లోని ఏ సభ్యులైనా చేసారని నింద వారిపై మోపాల్సి ఉంటుంది. ఈ మిషన్ ని పూర్తి చేయడానికి కావాలంటే మీ సభ్యల సహాయం తీసుకోవచ్చు" అని చెప్పాడు. దీనికి సమాధానంగా ఆదిరెడ్డి, " ఒకే బిగ్ బాస్ అలాగే చేస్తాను" అని చెప్పాడు.

"అయితే ఈ సీక్రెట్ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేస్తే మీ స్క్వాడ్ లో చనిపోయిన ఒకరిని రీవైవ్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ సీక్రెట్ మిషన్ గురించి ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. ఎవరికైనా అనుమానం వస్తే వారిని దారి మళ్లించండి" అని బిగ్ బాస్ చెప్పగా, సరేనని ఆదిరెడ్డి సమాధానమిచ్చాడు. మరి చూడాలి ఆదిరెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో? లేదో?