English | Telugu

ఆదిరెడ్డి 'వన్ మ్యాన్ షో'!

బిగ్ బాస్ ఈ సీజన్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి,‌ తన పర్ఫామెన్స్ తో టాప్-5 లోకి దూసుకొచ్చాడు ఆదిరెడ్డి. తన యాసతో, భాషతో పాటుగా కామెడీ టైమింగ్ తోడై అదరగొడుతున్నాడు.

అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి, రోహిత్ కి ఇచ్చిన టాస్క్ 'మనీతో మేజ్'. ఈ టాస్క్ లో ఆదిరెడ్డి తన తెలివితేటలు వాడి త్వరగా టాస్క్ పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే ఈ టాస్క్ కి ముందు హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ ఓటింగ్ వేయమన్నాడు.‌ "ఇప్పుడు జరిగే టాస్క్ లో ఎవరు గెలుస్తారో చెప్పండి" అని బిగ్ బాస్ అడిగాడు. శ్రీసత్య మాత్రమే రోహిత్ కి ఓటు వేయగా, మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఆదిరెడ్డికి ఓటు వేసారు. అలాగే ఆదిరెడ్డి గెలవగా, హౌస్ అందరూ డబ్బులు గెలుచుకున్నారు.

అయితే అసలు కథ ఆ తర్వాత మొదలైంది. బిగ్ బాస్ ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూంకి పిలిచాడు. "ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఆదేశాలను మాత్రమే ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకుంటే ప్రైజ్ మనీ నుండి డబ్బులు కట్ అవుతాయి" అని బిగ్ బాస్ చెప్పగా ఆదిరెడ్డి సరేనని అన్నాడు. ఆ తర్వాత చీకటి గదిలోకి వెళ్ళమనగా లోపలికి వెళ్ళాక వింత వింత అరుపులు, దెయ్యం సౌండ్స్ వచ్చేలా ప్లే చేసాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఆదిరెడ్డి భయంతో చేసిన అరుపులకు హౌస్ మేట్స్ అంతా ఫుల్ గా నవ్వుకున్నారు. అయితే ఈ టాస్క్ మధ్యలో శ్రీహాన్ ని లోపలికి పంపించగా, ఆదిరెడ్డికి ఉన్న కాస్త భయాన్ని కూడా రెట్టింపు చేసాడు. "యేంది బిగ్ బాస్ ఈ ఆటలు. నా చేతిలో బొక్క ఉంది. దీంతో ఎవరు వస్తే వారిని కొడతా" అని ఆదిరెడ్డి అన్నాడు. ‌సడన్ గా ఒక దెయ్యం సౌండ్స్ రావడంతో "రేయ్ ఏమన్నా అయితే నా శవాన్ని తీసుకెళ్ళండి" అని ఆదిరెడ్డి అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.