English | Telugu
సూర్యకాంతం కళ్ళ ముందుకు వచ్చినట్టే వుంది...రోహిణికి నరేష్ కాంప్లిమెంట్
Updated : Dec 5, 2023
కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఎప్పటిలాగే అలరించడానికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఆ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ ఎపిసోడ్ కి సీనియర్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు నరేష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీమ్ తో ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. ఇక నరేష్ వస్తూనే "ఆకాశంలో ఒక తార" అనే సాంగ్ కి కృష్ణ గారిలా డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక శ్రీముఖి కూడా ఆయనతో జత కలిసి డాన్స్ చేసింది. శ్రీముఖి గెటప్ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కి చక్కగా సరిపోయింది. "నాకు అప్పుడప్పుడు మీ జంటను చూసిన ప్రతీసారి" అంటూ గట్టిగా అరిచి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసింది శ్రీముఖి. ఇక నరేష్ ముఖంలో ఆనందం బాగా కనిపించింది ఆ కామెంట్ కి. తర్వాత సద్దాం, యాదమ్మ రాజు, రోహిణి కలిసి స్కిట్ వేశారు.."దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" బాక్గ్రౌండ్ లో వస్తుంటే వీళ్ళు దానికి తగ్గ నటన చేసి స్కిట్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
సద్దాం చేతిలో మందు బాటిల్ పట్టుకుని తాగుతూ వచ్చి "ముందు నాకు 90 కి డబ్బులివ్వు" అని రోహిణిని అడిగేసరికి "నేను నైటీలు కొనుక్కోకుండా డబ్బులు పోగేస్తుంటే నీకు 90 కి ఇవ్వాలా" అని ఏడుస్తూ ఉన్న ఈ స్కిట్ చూసి అనిల్ రావిపూడి ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఇంకో స్కిట్ లో రోహిణి అచ్చం సూర్యకాంతంలా నటిస్తూ కోడల్ని సాధించే రోల్ వేసి స్కిట్ ని బాగా పండించింది. ఈ స్కిట్ చూసిన నరేష్ ఫుల్ గా ఎంజాయ్ చేసి "ఆ అమ్మాయిని చూస్తే నిజంగా సూరేకాంతం గారు కళ్ళ ముందుకు వచ్చినట్టు ఉంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇక నరేష్ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ని మ్యూజిక్ తో సహా ఇమిటేట్ చేసి అందరినీ తనదైన కామెడీ స్టైల్ చేసి చూపించి అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇలా ఈ కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఈ వారం అలరించబోతోంది. ఇక ఈ షో ఛైర్మెన్ అనిల్ రావిపూడి, హోస్ట్ శ్రీముఖి కలిసి "ఒక లైలా కోసం" సాంగ్ కి డాన్స్ స్టేజిని మరింత కలర్ ఫుల్ గా చేశారు.